బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 7 అక్టోబరు 2019 (12:25 IST)

సీఎం జగన్‌కు కె రామకృష్ణ.. యురేనియం తవ్వకాలు ఆపండి..

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. యురేనియం తవ్వకాలు జరుగుతున్న పులివెందుల ప్రాంతంలో రచ్చబండ నిర్వహించాలని రామకృష్ణ చెప్పారు. 

యురేనియం తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాల్లో అఖిలపక్ష బృందం పర్యటించింది. అక్కడ ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు.
 
గర్భిణులకు గర్భస్రావాలు జరుగుతున్నాయి. ప్రజలకు, పర్యావరణానికి పెను ప్రమాదంగా పరిణమించిన యురేనియం తవ్వకాలను తక్షణం ఆపండి. ఆయా ప్రాంతాల్లో రచ్చబండ నిర్వహించండి... అంటూ రామకృష్ణ కోరారు.