మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 అక్టోబరు 2021 (17:52 IST)

చెల్లిని చంపిన తల్లి.. తల్లిని హత్య చేసిన కొడుకు.. ఎక్కడ?

క్షణికావేశం ఒకే కుటుంబంలో ఇద్దరి ప్రాణాలను బలిగొంది అంతే కాకుండా అదే కుటుంబంలోని వ్యక్తిని హంతకుడిగా మార్చి జైలుకు పంపింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలో చోటుచేసుకుంది. కూతురు తరచూ ఫోన్ చూస్తుందని తల్లి అనేక సార్లు మందలించింది. 
 
అయినప్పటికీ కూతురులో మార్పు రాలేదు. అయితే ఎంత చెప్పినా కూతురు ఫోన్ చూడటం మానడం లేదని తీవ్ర ఆవేశానికి గురైన తల్లి కూతురి మెడకు చున్నీ బిగించి హత్య చేసింది.
 
అయితే ఆ సమయం లో ఇంట్లో ఉన్న ఆమె కొడుకు చెల్లిని చంపింది అన్న కోపంతో ఆవేశానికి గురి అయ్యాడు. తల్లి చెల్లిని చంపింది అనే క్షణికావేశంలో పక్కనే ఉన్న కత్తి తీసుకుని తల్లిని దారుణంగా పొడిచాడు. దాంతో తల్లి కూడా ప్రాణాలు కోల్పోయింది. 
 
ఇంట్లో అరుపులు కేకలు విన్న స్థానికులు అక్కడకు చేరుకుని ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ఘటన పై పోలీసులకు సమాచారం ఇవ్వడం తో అక్కడకు చేరుకున్న పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేశారు.