మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 25 జూన్ 2019 (17:49 IST)

ఈ నెల 28న విడుదల కానున్న 'కల్కి'

ఒకప్పటి యాంగ్రీ యంగ్‌మేన్ రాజశేఖర్ హీరోగా తాజాగా రూపొందించబడిన సినిమా 'కల్కి'. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆదాశర్మ కథానాయికగా నటించారు. కాగా... ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ మేరకు సెన్సార్ బోర్డువారు ఈ సినిమాకి ఎలాంటి కట్స్ లేకుండా యూ/ఏ సర్టిఫికెట్‌ను మంజూరు చేయడం జరిగింది. దాంతో ఈ నెల 28వ తేదీన అన్ని ప్రాంతాల్లోనూ ఈ సినిమాను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు చిత్ర యూనిట్. 
 
ఇక హీరో రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్‌గా చేసిన చాలా సినిమాలు ఆయనకి సంచలన విజయాలను తెచ్చి పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా నటించిన ఈ సినిమా కూడా తప్పకుండా హిట్ సాధించి తీరుతుందనీ, ఆ సెంటిమెంట్ కొనసాగుతుందనీ ఆయన భావిస్తున్నాడు. మరి ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆయన నమ్మకాన్ని ఎంత మేరకు నిలబెడుతుందో వేచి చూడాల్సిందే మరి.