సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 3 జులై 2021 (13:42 IST)

నెల్లూరులో కామాంధ బ్యాంక్ మేనేజర్, లోను కోసం వచ్చిన మహిళలపై లైంగిక వేధింపులు

నెల్లూరు జిల్లాలో మరో కామాంధుడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పొదలకూరులో మహిళల పట్ల ప్రముఖ బ్యాంకు మేనేజర్ బ్యాంకులోనే అసభ్యంగా ప్రవరిస్తూ వేధింపులకు గురి చేస్తున్నాడు.
 
అతడి అసభ్య ప్రవర్తనకు సంబంధించిన దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. సీసీ కెమెరా దృశ్యాలు ఓ మీడియా  చేతికి చిక్కాయి. 
 
లోన్లు కోసం వచ్చే వారిని ఆశపెట్టి, భయపెట్టి బ్యాంకు మేనేజర్ లొంగ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.