ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Updated : శుక్రవారం, 21 మే 2021 (18:02 IST)

కరోనాకి ఆయుర్వేద మందు: నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకి బయలుదేరిన ఐసిఎంఆర్ బృందం

బొరిగి ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందుపై అధ్యయనానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) బృందం బయలుదేరిది. ఈరోజు సాయంత్రానికి నెల్లూరుకి ఐసిఎంఅర్ బృందం వచ్చే అవకాశం వుంది.
 
ఆయుష్ ఇన్‌ఛార్జ్ మంత్రి, ఐ.సి.ఎం.ఆర్. డైరక్టర్ జనరల్‌తో మాట్లాడిన ఉపరాష్ట్రపతి
నెల్లూరు ఆయుర్వేద మందు మీద అధ్యయనం ప్రారంభించాలని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆయుష్ ఇన్‌చార్జ్ మంత్రి శ్రీ కిరణ్ రిజ్జు, ఐ.సి.ఎం.ఆర్. డైరక్టర్ జనరల్ ప్రొఫెసర్ బలరామ్ భార్గవ్‌కు సూచించారు. నెల్లూరు ఆయుర్వేద మందు విషయంలో నెలకొన్న పరిస్థితులు ఉపరాష్ట్రపతి దృష్టికి వచ్చాయి.
 
ఈ నేపథ్యంలో ఆయన వెంటనే కేంద్ర మంత్రి మరియు డైరక్టర్ జనరల్ తో ఫోన్ ద్వారా మాట్లాడారు. వెంటనే ఆ మందు మీద అధ్యయనం ప్రారంభించి, వీలైనంత త్వరగా నివేదిక వచ్చేలా చొరవ తీసుకోవాలని సూచించారు.