శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Modified: బుధవారం, 19 మే 2021 (22:02 IST)

నేనున్నాను, కరోనా బాధితులకు మంత్రి హరీష్ రావు భరోసా

బుధవారం సాయంత్రం సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి చేరుకున్న మంత్రి  హరీష్ రావు సుమారు 30 నిమిషాల పాటు ఐసియు 2లో తిరుగుతూ కోవిడ్ పేషెంట్లున్న వార్డులో అందుతున్న వైద్య చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు.

ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు సేవలందిస్తున్నారని వారిని మంత్రి హరీష్ రావు వైద్య సిబ్బందినీ అభినందించారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ తమిళ అరుసు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.