బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: మంగళవారం, 18 మే 2021 (22:26 IST)

కరోనా బాధితులను డాక్టర్లు పిండెేస్తున్నారు: అంబటి రాంబాబు

కరోనా బాధితులను కొందరు డాక్టర్లు పిండెేస్తున్నారన్నారు వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఫీజుల విషయంలో  హస్పిటల్స్ పేషెంట్లను ఇబ్బంది పెడుతున్నాయి.
 
మానవాతా దృక్పథం లేని వైద్యులు జాతికి భారం. ఇలాంటి వారిని సమాజం నుంచి వెలివేయాలి.
ఫిర్యాదు వస్తే వారిని క్షమించేది లేదు. సత్తెనపల్లిలో అనాధ శవాలకు ఉచితంగా అంత్యక్రియలు జరిపిస్తాం. కరోనా సమాజంలో భయోత్పాన్ని సృష్టిస్తోంది.
 
తండ్రి చనిపోతే పిల్లలు దహనం చేయలేని పరిస్థితి. ఆధునిక సమాజంలో ఇలాటి పరిస్థితలు 
దురదృష్టకరం. మన దేశం ఇంకా అజ్ఞాన సంప్రదాయాలకు పెద్దపీట చేయటం శోచనీయం. 
అనాధ శవాల ఖననం కోసం స్వచ్చంద సంస్థలు ముందుకు రావటం మంచి పరిణామం అన్నారు.