మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: సోమవారం, 3 మే 2021 (19:30 IST)

కర్నూలు జిజిహెచ్ స్టేట్ కోవిడ్ ఆస్పత్రిలో కోవిడ్ విధులకు గైర్హాజరైన వైద్యులు సస్పెండ్

కర్నూలు జిజిహెచ్ ఓల్డ్ గైనిక్ వార్డ్ రూమ్ నెంబర్ 99 లో ఏర్పాటు చేసిన కోవిడ్ పేషేంట్స్ ట్రయాజ్ చికిత్సా కేంద్రాన్ని ఈ మద్యాహ్నం జేసీ(రెవెన్యూ) రామసుందర్ రెడ్డి, కె.ఎం.సి కమీషనర్ డీకే బాలాజీ, జిజిహెచ్ సూపరింటెండెంట్ డా.నరేంద్రనాథ్ రెడ్డి లతో కలిసి ఆకస్మిక తనిఖీ చేసి, కోవిడ్ పేషేంట్స్ తో మాట్లాడి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు కలెక్టర్ వీరపాండియన్.
 
తన ఆకస్మిక తనిఖీలో కోవిడ్ డ్యూటీలకు అనేస్థీషియా అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.ఎస్.సుధీర్ కుమార్, మరో పీజీ డాక్టర్ బి.సురేష్ బాబు (ఫిజియాలజి) అనే ఇద్దరు సీనియర్ డాక్టర్లు విధులకు గైర్హాజరు అయినట్లు డ్యూటీ రిజిస్టర్ ద్వారా పరిశీలించి తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను ఇచ్చారు జిల్లా కలెక్టర్ వీరపాండియన్.
 
కర్నూలు జిజిహెచ్ లో కోవిడ్ విధులకు హాస్పిటల్  సూపరింటెండెంట్ డ్యూటీ ఆర్డర్ వేసినా గైర్హాజర్ అయితే సీనియర్ డాక్టర్లను కూడా ఉపేక్షించకుండా సస్పెండ్ చేస్తామని స్పష్టం చేశారు.
 
కర్నూలు జిజిహెచ్ లో  కోవిడ్ బాధితుల వైద్య విధులకు కొందరు సీనియర్ డాక్టర్లు గా ఉన్న ప్రొఫెసర్స్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్  గైర్హాజరు అవుతున్నారని,  పేషేంట్స్ వద్దకు వెళ్లి ట్రీట్మెంట్ ఇవ్వడం లేదని, జూనియర్ డాక్టర్లతో నడిపిస్తున్నారని,  ట్రయాజ్ కు వచ్చిన కోవిడ్ పేషేంట్స్ ను పట్టించుకోవడం లేదని, వెంటనే అడ్మిషన్ చేసుకోవడం లేదనే ఫిర్యాదులు వచ్చాయని,  మీడియాలో అడ్వర్స్ రిపోర్ట్స్ కూడా వచ్చాయని, సీనియర్ డాక్టర్లు కోవిడ్ పేషేంట్స్ ను పట్టించుకోకపోవడం వల్ల జిల్లా యంత్రాంగానికి/ ప్రభుత్వానికి అపవాదు వస్తోందని  అందువల్లనే ఈ రోజు కర్నూలు జిజిహెచ్ కోవిడ్ పేషేంట్స్ ట్రయాజ్ వైద్య విభాగాన్ని ఆకస్మిక తనిఖీ చేసి..కోవిడ్ విధులకు గైర్హాజరు అయిన ఇద్దరు సీనియర్ డాక్టర్లను సస్పెండ్ చేశానన్నారు.
 
ఫస్ట్ వేవ్ కోవిడ్ విపత్తులో బాగా పని చేసి మంచి పేరు తెచ్చుకున్న  కర్నూలు జిజిహెచ్ సీనియర్ డాక్టర్లు సెకండ్ వేవ్ కోవిడ్ విపత్తులో కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఇంకా బాగా చిత్తశుద్ధితో పనిచేసి, కోవిడ్ బాధితులకు ధైర్యం, మానసిక భరోసా కలిగించేలా పేషేంట్స్ వద్దకు వెళ్లి ధైర్యం చెప్పి, ట్రీట్మెంట్ ఇవ్వాలని ..ఈ మేరకు తగు చర్యలు తీసుకుని కోవిడ్ డ్యూటీ సీనియర్ డాక్టర్ల డ్యూటీ ఆర్డర్స్ ను ప్రతి రోజూ తనకు పంపాలని కర్నూలు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డా.జిక్కి, సూపరింటెండెంట్ డా.నరేంద్రనాథ్ రెడ్డి లను ఆదేశించారు జిల్లా కలెక్టర్ వీరపాండియన్