1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Modified: శనివారం, 24 ఏప్రియల్ 2021 (18:57 IST)

కరోనా వాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా లక్షణాలు కనబడితే? నిమ్స్ వైద్యులు సమాధానం

కరోనా వాక్సిన్ తీసుకున్న తర్వాత జ్వరం, జలుబు, దగ్గు లాంటి కరోనా లక్షణాలు వస్తే కరోనా పరీక్ష చేయించుకోవాలా? వద్దా?
 
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత "కరోనా టెస్ట్" పాజిటివ్ వస్తుందా?
 
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా వ్యాధి కానీ కరోనా వ్యాధి లక్షణాలు కానీ వస్తాయా?
 
కరోనా వ్యాధి ప్రపంచ వ్యాప్తంగా చాలా వేగంగా వ్యాప్తి చెందుతూ ఉన్నా, వ్యాక్సిన్ కనుగొనడానికి సుమారు సంవత్సర కాలం పట్టింది. ఎన్నో ఎన్నో ప్రయోగాల అనంతరం దానిని ప్రజలకు అందించారు మన శాస్త్రవేత్తలు. 
 
ఈరోజు మన భారతదేశంలో రెండురకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నవి
1. Covaxin ( కోవాక్సిన్ )
2. Covisheild ( కోవీ షీల్డ్ )
 
కోవాక్సిన్ కూడా  పోలియో మరియు రేబిస్ వ్యాక్సిన్ల లాగా virion inactivated vero cell derived virus  technology ద్వారా భారత్ బయోటెక్ వారు తయారు చేస్తున్నారు.
 
కోవిషీల్డ్ వాక్సిన్ , ఎబోలా వ్యాక్సిన్ల లాగా చింపాంజీ ఆడినోవైరస్ స్పైకె ప్రోటీన్ టెక్నాలజి ద్వారా Oxford Astra genica వారు తయారు చేస్తున్నారు.
 
రెండు రకాల వ్యాక్సిన్లు సమర్థవంతంగా పని చేయుచున్నవి. పోలియో వ్యాక్సిన్, రేబిస్ వ్యాక్సిన్, ఎబోలా వైరస్ వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఆ జబ్బులు ఎలా రావో, ఈ కరోనా వైరస్ వ్యాక్సిన్ చేయించుకున్న తర్వాత కూడా కరోనా వైరస్, కరోనా వ్యాధి రాదు.
 
సాధారణంగా మన చిన్ననాటి నుంచి చూస్తున్నదే ఏ రకమైన వ్యాక్సిన్ తీసుకున్న ఒకటి రెండు రోజులు జ్వరం, నీరసం లాంటి చిన్న చిన్న ఇబ్బందులు మరియు వ్యాక్సిన్ వేసిన చోట వాపు, ఎర్రగా మారడం అనేది సర్వసాధారణం. అంతకన్నా ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించగలరు. 
 
వ్యాక్సిన్ వేయించుకోవడం వలన ఖచ్చితంగా కరోనా వ్యాధి మాత్రం రాదు. 
 
కరోనా టెస్టు అనగా సాధారణంగా అంటిజెన్ టెస్ట్  చేస్తారు.
 
1. రాపిడ్ యాంటిజెన్ టెస్ట్  
2. RT - PCR టెస్ట్.
 
మన గవర్నమెంట్ వారు RT - PCR చేస్తున్నారు. కొంతమంది ప్రైవేట్ వారు రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ చేస్తున్నారు. వాక్సిన్ తరువాత కేవలం 5% మందికే చిన్న వొళ్లు నెప్పులు, జ్వరం వంటివి వస్తాయి.. అందరికీ జ్వరం వస్తుందనేది పూర్తి అబద్దం.. 
 
ఎవరికైనా దగ్గు, ఆయాసం ఉంటే, అవి కొవిడ్ వల్ల అయ్యుండే అవకాశం ఎక్కువ.. ఆ ఇబ్బందులు వాక్సిన్ వల్ల కాదు. వాక్సిన్ తరువాత 15 రోజుల వరకు కొవిడ్ ముక్కు టెస్టు అందరికీ పాజిటివ్ వస్తుందనేది శుద్ద అబద్దం. ఒక్కరికి కూడా వాక్సిన్ వల్ల కొవిడ్ టెస్టు పాజిటివ్ రాదు. జ్వరం, నెప్పులు ఉన్నవారికి ముక్కు కొవిడ్ టెస్టు పాజిటివ్ వస్తే.. వారికి 100% కొవిడ్ జబ్బు ఉన్నట్టే.. వాక్సిన్ వల్ల ముమ్మాటికీ కాదు.

ఇక రెండు డోసులు టీకాలు తీసుకున్న తర్వాత కూడా కొవిడ్‌ ఎందుకు సోకుతోందన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
 
టీకా సమర్థత కూడా 70-80 శాతం మాత్రమే. మిగిలిన 20-30 శాతం మందిలో టీకా పొందిన తర్వాత కూడా యాంటీబాడీలు వృద్ధి కాకపోవచ్చు. ఇటువంటి వారిలో కరోనా వైరస్‌ రెండోసారే కాదు.. 3, 4 సార్లు కూడా సోకే అవకాశాలుంటవి.
 
రెండు డోసులు వేయించుకున్న.. రెండు వారాల తరువాత, ఒక 70% మందికి  మాత్రమే.. ఇమ్యూనిటీ వస్తుంది. వాక్సిన్ వేసుకున్న వెంటనే ఇమ్యూనిటీ రాదు. వాక్సిన్ వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే, మీకు కొవిడ్ వచ్చినా, లైట్‌గా వస్తుంది. ఐసియూలో చేరేంత మరియూ ప్రాణం పోయేంత సీరియస్‌గా రాదు.
 
Dr. L.N. Rao
NIMS 24 Hospital