శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Modified: గురువారం, 20 మే 2021 (19:28 IST)

కరోనావైరస్: ఏపీ పట్టణాల్లో తగ్గుదల, గ్రామాల్లో పెరుగుదల, ఎందుకని?

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం COVID-19 వ్యాప్తి నిరోధంలో భాగముగా రాష్ట్ర వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ వలన పట్టణాలలో కొంత మెరుగైన పరిస్థితి గమనించినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం పంట చేతికొచ్చే ఈ సమయంలో చేపడుతున్న వ్యవసాయ పనులు దృష్ట్యా మరియు కోవిడ్ పట్ల వారికి కొంత అవగాహన రాహిత్యము వలన సెకండ్ వేవ్ అనేది గ్రామీణ ప్రాంతాల్లో చాప కింద నీరులా వ్యాప్తి చెందుతున్నట్లు గమనించడం జరిగింది.
 
వ్యాప్తిని నిరోధించడం అనేది ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్‌మెంట్ మరియు వ్యాక్సినేషన్ ప్రక్రియ సమర్ధవంతముగా నిర్వహించడం అనేది కీలకంగా భావించిన రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో వ్యాధి మరింత వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి వ్యాధి కి గురైన వ్యక్తిని ప్రారంభదశలోనే గుర్తించడం, వారిని వేరుచేయడం మరియు  పరీక్షలకు గురిచేసి వ్యాధికి అనుగుణముగా తగిన చికిత్స అందించడం ద్వారా నియంత్రించడము అనేది చాలా ముఖ్యం అని భావించింది.
 
మెరుగైన ఫలితాల సాధన కోసం, గ్రామీణ ప్రాంతాల్లో నిఘా, స్క్రీనింగ్, ఐసోలేషన్ మరియు రిఫరల్స్ వ్యవస్థల లో పటిష్టమైన చర్యలు చేపట్టి నిర్వహించడము తో పాటు, అన్ని స్థాయిలలో ప్రాథమిక ఆరోగ్య మౌలిక సదుపాయాలు  మరియు ఇతర ముఖ్యమైన ఆరోగ్య సేవల ను  మరింత బలోపేతం చేసి నిర్వహించడానికి  రాష్ట్ర ప్రభుత్వం ఈ కింది చర్యలను తీసుకోవడం జరిగినది.
 
నిఘా, స్క్రీనింగ్, ఐసోలేషన్ మరియు చికిత్స కు నివేదించడం:
1. గ్రామంలో నియమించబడిన ప్రతి ఆశా కార్యకర్త  జ్వరం, ఇన్ఫ్లూఎంజా లాంటి అనారోగ్యం లేదా ఇతర  తీవ్రమైన శ్వాసకోశ అంటువ్యాధులు (ILI / SARI) తో బాధపడేవారిని విలేజ్ హెల్త్ వర్కర్, శానిటేషన్,  న్యూట్రిషన్ కమిటీ మరియు గ్రామ వాలంటీర్లు సహాయముతో చురుకైన నిఘా ద్వారా క్రమపద్ధతిలో  నిర్వహించి గుర్తించాలి.
 
2. గ్రామం లో ఉన్న ప్రతి ఆరోగ్య ఉప కేంద్రంలో జ్వరం, ILI / SARI కేసుల నిర్వహణకు ప్రతిరోజూ కనీసం ఒక గంట సమయం పాటు OPD నిర్వహించాలి మరియు ఈ విషయాన్ని స్థానిక ప్రజలలో  ప్రచారం చేయాలి.
 
3. గ్రామ వాలంటీర్లతో పాటు సంబంధిత గ్రామానికి చెందిన ఆశా కార్యకర్త గ్రామం లో నివసించే ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితిని విచారించడానికి ప్రతి  ఇంటిని సందర్శించాలి. ఏ వ్యక్తి కైనా  కోవిడ్ అనుమానాస్పద లక్షణాలు కనపడినపుడు వారిని వెంటనే గుర్తించి ఇతరులతో వారిని వేరు చేయాలి.
 
అనుమానాస్పద కేసుల నిర్వహణ:
4. ఆ విధంగా వేరుచేయబడిన వ్యక్తులందరికీ 24 గంటల్లో సంబంధిత  ANM  ద్వారా హోమ్  ఐసోలేషన్ కిట్ అందించబడుతుంది మరియు వారికి   పరీక్ష నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేయాలి.
 
5. డాక్టర్ ద్వారా అనుమానిత వ్యక్తి నుండి  సేకరించిన  నమూనాను  రాపిడ్ యాంటిజెన్ కిట్ తో లేదా RTPCR స్వాబ్ తో పరీక్షించాలి.
 
6. డాక్టర్ల మీద ఒత్తిడి నివారించడానికి రాపిడ్ యాంటిజెన్ టెస్టింగ్ చేయడంలో ANM లు కూడా శిక్షణ పొందాలి. ఇలాంటి అత్యవసర పరిస్థితులలో శిక్షణ పొందడం సముచితం.
 
7. ఈ అనుమానిత వ్యక్తులు తమ పరీక్ష ఫలితాలు లభించే వరకు స్వీయ నిర్భందం లో ఉండాలని  సలహా ఇవ్వాలి.
 
కోవిడ్ సానుకూల కేసుల నిర్వహణ:
8. పాజిటివ్‌గా నిర్ధారించబడిన  వ్యక్తులందరికీ తగిన మనోధైర్యం కలిగించాలి, వ్యాధి పట్ల  భయపడవలసిన అవసరం లేదని  సలహా ఇవ్వాలి. వ్యక్తి నుండి కుటుంబ సభ్యులు వ్యాధి బారిన పడకుండా నిరోధించడానికి తీసుకోవాల్సిన వివిధ ముందు జాగ్రత్త చర్యల గురించి  తెలియజేయాలి అవగాహన కల్పించాలి.
 
9. కోవిడ్ సానుకూల కేసుల ఆరోగ్య పరిస్థితిని సంబంధిత ANM ప్రతిరోజూ పర్యవేక్షించాలి.
 
10. సహ అనారోగ్యాలతో హోమ్ ఐసోలేషన్ లో ఉన్న కోవిడ్ సానుకూల వ్యక్తులకు చికిత్స అవసరమైన సందర్భాల్లో సంబంధిత  ఆశా కార్యకర్త మెడికల్ ఆఫీసర్ తో టెలీ కన్సల్టేషన్  ఏర్పాటు చేయాలి.
 
11. హోమ్ ఐసోలేషన్ లో  ఉన్న వారందరికీ 104 ద్వారా టెలీ కన్సల్టేషన్  సౌకర్యం  ఉంటుంది. అదేవిధంగా కోవిడ్ అనుమానితులందరి కీ కూడా 104 ద్వారా సలహాలు సూచనలు అందించే సౌకర్యం సైతం ఏర్పాటు చేయబడింది.
 
12. తీవ్రమైన లక్షణాలు మరియు  తక్కువ ఆక్సిజన్ సంతృప్తత కలిగిన వ్యక్తులను మెడికల్ ఆఫీసర్ ద్వారా జత చేయబడిన ఉన్నత శ్రేణి  ఆసుపత్రులు మరియు  కోవిడ్ కేర్ సెంటర్లు కు వారిని తరలించాలి.
 
13.రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ (రాట్) కిట్‌లను పౌరులందరికీ అందుబాటులో కొరకు ఆరోగ్య ఉప కేంద్రాలు (ఎస్సీలు) / ఆరోగ్యం మరియు సంరక్షణ కేంద్రాలు (హెచ్‌డబ్ల్యుసి), ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పిహెచ్‌సి) లలో ఉంచాలి.
 
14.సానుకూల వ్యక్తుల యొక్క అన్ని ప్రాధమిక మరియు ద్వితీయ పరిచయాలను గుర్తించాలి. లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వారిని వేరు చేసి వారికి పరీక్షలు నిర్వహించాలి.
 
హోమ్  మరియు కమ్యూనిటీ  ఆధారిత ఐసోలేషన్ ను నిర్వహించడం.
1. దాదాపు 80-85% COVID-19 కేసులు ఎటువంటి రోగలక్షణాలు లేకుండా లేదా స్వల్ప లక్షణాలతో ఉంటారు. వీరికి ఆసుపత్రి చికిత్స అనేది అవసరము ఉండదు. ఇంట్లో లేదా గ్రామ స్థాయిలో ఏర్పాటు చేయబడిన కోవిడ్ కేర్ సదుపాయాలలో వీరిని నిర్వహించవచ్చు.
 
2. COVID రోగులలో ఆక్సిజన్ సంతృప్తని పర్యవేక్షించడం అనేది చాలా ముఖ్యం దీనిని సంబంధిత ఆశా కార్యకర్త లేదా ANM తగిన జాగ్రత్తలు తీసుకుని నిర్వహించాలి.
 
3. గృహ సందర్శనాల సమయంలో కోవిడ్  రోగుల ఆక్సిజన్ సంతృప్తని గ్రామం లో ఉన్న ASHA కార్యకర్త ప్రతిరోజూ పర్యవేక్షించాలి. ఆక్సిజన్‌ సంతృప్తత లో 94% కంటే తక్కువ  క్షీణత గమనించినపుడు వెంటనే సంబంధిత ANM కి తెలియచేయాలి.
 
4. అటువంటి వ్యక్తుల ఉష్ణోగ్రత కూడా పరిశీలించబడాలి.
 
5. పల్స్ ఆక్సిమీటర్లు మరియు థర్మామీటర్లను వాడిన ప్రతీ సారి  ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్‌లో శుభ్రపరచి   తరువాత వస్త్రంతో తుడవాలి.
 
6. శ్వాస తీసుకోవడం లో వ్యత్యాసం మరియు ఇబ్బంది, రక్తం లో ఆక్సిజన్ సంతృప్తత SpO2 <94%, ఛాతీలో నిరంతర నొప్పి లేదా  ఒత్తిడి, మానసిక గందరగోళం లేదా స్పందించడములో వైఫల్యము వంటి తీవ్రమైన సంకేతాలు లేదా లక్షణాలు గమనించినపుడు ఆశా లేదా గ్రామ  వాలంటీర్ ద్వారా వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.
 
7. SpO2 94% కంటే తక్కువగా ఉంటే, రోగి యొక్క SpO2 ను బట్టి ఆక్సిజన్ బెడ్ కోవిడ్ హాస్పిటల్ లేదా కోవిడ్ కేర్ సెంటర్ స్థాయి సదుపాయానికి రోగిని సూచించాలి.
 
8. హోమ్ ఐసోలేషన్ లో ఉండే రోగులు లక్షణాలు ప్రారంభమైనప్పటి నుండి కనీసం 10 రోజులు గడిచిన తరువాత ఐసోలేషన్ ముగించాలి. హోమ్  ఐసోలేషన్ వ్యవధి ముగిసిన తర్వాత మళ్ళీ పరీక్ష అవసరం లేదు. హోమ్ ఐసోలేషన్ ముగిశాక  వారు తప్పక మరో 14 రోజులు ఇంటి నిర్బంధాన్ని నిర్వహించండి. కానీ ఈ సమయం లో ఎటువంటి చికిత్స అవసరము లేదు..
 
గ్రామ  స్థాయిలో ఏర్పాటు చేసే వైద్య  సౌకర్యాలు:
హోమ్ ఐసోలేషన్ నిర్వహించే అవకాశం లేని వారికి ఆ వ్యక్తి వలన అతని కుటుంబసభ్యులకు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి వారికి గ్రామ స్థాయిలో మినీ కోవిడ్ కేర్ సెంటర్ల వంటి వి ఏర్పాటు చేయాలి. ఈ కేంద్రాలలో గ్రామం లో ఉన్న ఆశా కార్యకర్త మరియు గ్రామ సచివాలయ ఉద్యోగుల సహకారం తో స్టానిక ANM  సేవలు అందించాల్సి ఉంటుంది.
 
ఈ మినీ కోవిడ్ కేర్ కేంద్రాల కొరకు అవసరమైన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లును స్థానిక గ్రామ కమిటీ  సమకూర్చుకోవాలి, వీటితో పాటు అన్ని అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలి. ఈ కేంద్రానికి జత చేయబడిన మెడికల్ ఆఫీసర్ క్రమ ప్రకారము ఈ  మినీ కోవిడ్ కేర్ కేంద్రాలను సందర్శించాలి.
 
మరియు రోగులకు ఏదైనా తీవ్రమైన పరిస్థితులు ఏర్పడిన సందర్భంలో వారిని దగ్గర లో గల కోవిడ్ ఆసుపత్రులకు తరలించబడాలి. అటువంటి వ్యక్తులను తరలించడానికి మరియు రోగులకు అత్యవసర చికిత్స అందించవలసిన సందర్భాలు  ఏర్పడినపుడు ప్రతి గ్రామ సచివాలయం ఒక  వాహనాన్ని అద్దెకు తీసుకోవచ్చు.
 
గ్రామ స్థాయిలో కోవిడ్ సానుకూల వ్యక్తుల కోసం కార్యాచరణను నిర్వహించడానికి  PHC కేంద్రంగా ఉంటుంది. ఇక్కడ అన్ని అనుమానాస్పద కేసులు పరీక్షించబడడం, RTPCR స్వాబ్  తీసుకోవటానికి మరియు అన్ని సానుకూల కేసులు  స్థానిక PHC మెడికల్ ఆఫీసర్  చేత పరీక్షించబడతాయి.
 
గ్రామంలో కోవిడ్  పరిస్థితిని రోజువారీ పర్యవేక్షణ కోసం, మరియు పైన పేర్కొన్న అన్ని సూచనలు అన్నీ సక్రమంగా నిర్వహించబడడం ద్వారా సత్ఫలితాలు పొందేందుకు, మరియు వాటిని  నిర్ధరించుకోవడానికి  గాను  గ్రామ స్థాయి లో సర్పంచ్-చైర్మన్ గా, ANM కన్వీనర్ మెంబర్ గా, ఆశా కార్యకర్త, న్యూట్రిషన్ కమిటీ,  గ్రామ మరియు వార్డ్ వాలంటీర్ మెంబర్లు గా  గ్రామ కోవిడ్ మేనేజ్‌మెంట్ కమిటీని ఏర్పాటుచేయవలసి ఉంటుంది.
 
గ్రామ కోవిడ్ మేనేజ్‌మెంట్ కమిటీ హోమ్ ఐసోలేషన్  క్రింద ఉన్న అన్ని సానుకూల కేసులను, అనుమానాస్పద కేసులను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తూ ఉండాలి. గ్రామంలో పారిశుద్ధ్య డ్రైవ్‌లు నిర్వహించడం మరియు గ్రామంలో నివసించే ప్రజలు బయటకు వచ్చేటప్పుడు ప్రభుత్వము సూచించిన కోవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలి. కోవిడ్ నుండి సురక్షితముగా ఉండడానికి దానికి  తగిన ప్రవర్తనను అనుసరించేలా ప్రజలను ప్రోత్సహించాలి. దానికి సంబందించి ప్రజలకు అవగాహన కలిగించేలా హోర్డింగ్స్ ద్వారా పోస్టర్లు ద్వారా మరియు మైక్ ద్వారా విస్తృతంగా ప్రచారం చేపట్టి నిర్వహించాలి.
 
సంబంధిత ప్రభుత్వ విభాగాలు పై మార్గదర్శకాలను సంబంధిత క్షేత్ర సిబ్బంది సక్రమంగా అనుసరించేలా ఎప్పటికప్పుడు తగు  సలహాలు సూచనలు ఇవ్వాలి మరియు వాటిని నిర్ధారించుకోవాలి.