గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 21 మే 2021 (11:58 IST)

కరోనాపై కేంద్రప్రభుత్వ కొత్త మార్గదర్శకాలు ఇవే

కోవిడ్ నియంత్రణ లో వ్యాక్సినేషన్  ప్రక్రియ అనేది కీలకము అని భావించిన కేంద్రప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా నిర్వహించి నియంత్రించుటకు గాను  ఈ ప్రక్రియలో ఆసక్తి చూపి ప్రయివేటు సంస్థలకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించి, కార్యక్రమం సజావుగా అమలు చేయడం కొరకు రాష్ట్రాలన్నీ ఏకరీతి విధానాలు అవలంబించాలని సూచిస్తూ మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది. 
 
కేంద్ర ప్రభుత్వ సూచనలు అనుసరించి రాష్ట్రంలో ఆసక్తి గల ప్రయివేటు సంస్థలు  ఏర్పాటు చేసే ప్రయివేటు కోవిడ్ వ్యాక్సిన్ సెంటరులు మరియు వాటి  ద్వారా నిర్వహించబడే వ్యాక్సినేషన్ ప్రక్రియకు అనుమతి మరియు   నిర్వహణకు సంబందించి నియమ నిబంధనలు మరియు మార్గదర్శకాలను కోవిడ్ ఇన్ స్టెంట్ ఆర్డర్ 124 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీని ప్రకారం..
 
ప్రైవేట్ కోవిడ్ టీకా కేంద్రాలను (CVC) రిజిస్ట్రేషన్ చేసుకోవడం:
ప్రైవేట్ కోవిడ్  టీకా కేంద్రాలు (CVC లు) ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపే సంస్థలు అన్నీ కూడా టీకా సరఫరా మూలాలతో సంబంధం లేకుండా తమ పూర్తి వివరాలతో CoWIN పోర్టల్ లో రిజిస్టర్ చేసుకోవాలి. అంతే కాకుండా  ప్రయివేట్ కోవిడ్  టీకా కేంద్రాలలో (CVC) నిర్వహించిన అన్నీ టీకాల వివరాలను నమోదు చేయడం, టీకా ధృవీకరణకు సంబందించి డిజిటల్ పత్రాలను జారీ చేయడం మరియు వ్యాక్సినేషన్  తరువాత వ్యక్తులలో ఏదైనా ప్రతికూల సంఘటనలు ఏర్పడినా లేదా గమనించినా అలాంటి వివరాలు అన్నీ కూడా  CoWIN పోర్టల్ లో తప్పనిసరిగా నమోదు చేయవలసి ఉంటుంది.
 
ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్ ను ప్రయివేట్ కోవిడ్  టీకా కేంద్రముగా (CVC )  నిర్వహించాలి అనుకుంటే వాటికి ఈ కింది తెలిపిన సదుపాయాలు ఉండాలి.
 
i. టీకాలు నిలువ ఉంచడానికి  తగినంత సామర్ధ్యం గల శీతల యంత్ర పరికరాలు ఉండాలి. 
 
ii. టీకా కొరకు వేచి ఉండడానికి, టీకా నిర్వహించడానికి, టీకా నిర్వహించిన తరువాత పరిశీలన కోసం తగినంత స్థలం తో కూడిన గదులు ఉండాలి.
 
iii. శిక్షణ పొందిన వ్యాక్సి నేటర్లు  మరియు పరిశీలకులు  తగినంత సంఖ్య లో ఉండాలి.
 
iv. టీకా నిర్వహించిన తరువాత వ్యక్తిలో ఏదైనా ప్రతికూల సంఘటనలు గమనిస్తే  కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన  నిబంధనలు మరియు మార్గదర్శకాలు అనుసరించి  నిర్వహించే సామర్థ్యం ఉండాలి.
 
పారిశ్రామిక సంస్థల వద్ద CVC ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడం.
 
ఏదైనా ఒక పరిశ్రమకు దానికి అనుబంధముగా అన్నీ అర్హతలు గల ఆసుపత్రి ఉన్నట్లయితే అలాంటి సందర్భాల్లో ప్రైవేట్ హాస్పిటల్ ను ప్రయివేట్ కోవిడ్  టీకా కేంద్రముగా (CVC )  అనుమతించడానికి  ఎలాంటి నియమ నిబంధనలు అనుసరించవలసి ఉంటుందో వాటి  ప్రకారం అనుసరించి CoWIN పోర్టల్ లో ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్‌మెంట్ CVC గా రిజిస్టర్ చేసుకొనవలసి  ఉంటుంది.
 
స్వంత  ఆసుపత్రి సౌకర్యం లేని ఇతర పారిశ్రామిక సంస్థలు వాటికి దగ్గర లో గల ఇతర ప్రైవేట్ CVC కి మ్యాపింగ్ చేసుకుని ఇండస్ట్రియల్   వర్క్ ప్లేస్ CVC గా  నమోదు చేసుకో వలసి ఉంటుంది.
 
సంబంధిత జిల్లా ఇమ్యునైజేషన్  ఆఫీసర్ CVC రిజిస్ట్రేషన్ కు  అధీకృత అధికారి గా పనిచేస్తారు. ఇప్పటికే CoWlN పోర్టల్ లో రిజిస్టర్ కాబడిన ప్రయివేట్ CVC లు మరలా  CoWlN పోర్టల్ నమోదు చేసుకొన అవసరం లేదు.
 
టీకాల సేకరణ, నిలవచేయడం, ఉపయోగించడం, మిగులు మరియు ధరల నిర్వహణ:
 
ప్రైవేట్ ఆసుపత్రులు మరియు పారిశ్రామిక సంస్థలు వారి యొక్క ఆసుపత్రుల ద్వారా టీకా సేవలను అందించడానికి సిద్ధంగా ఉంటే, టీకా తయారీ దారులు తమ ఉత్పత్తిలో  భారత ప్రభుత్వానికి కేటాయించిన 50% సరఫరా లో నుండి కాకుండా మిగతా ఉత్పత్తి నుండి వారు  టీకాలను  సేకరించుకోవచ్చు.
 
CoWlN పోర్టల్ లో ఇప్పటికే నమోదు చేసుకున్న ప్రతి ప్రైవేట్ CVC తప్పనిసరిగా వారికి కావలసిన టీకాల యొక్క రకం మరియు అవసరపడే టీకాల మొత్తాన్ని CoWlN పోర్టల్ లో డిక్లేర్ చేయాలి.
 
టీకా అప్పాయిమెంట్ బుకింగ్‌ సమయంలో పౌరులు టీకా ఎంపిక కొరకు అందుబాటులో ఉన్న అన్నీ రకాల టీకాలు CoWIN పోర్టల్ లోని "అపాయింట్‌మెంట్స్" మాడ్యూల్‌లో ప్రదర్శించబడతాయి.
 
ప్రతి ప్రైవేట్ CVC తమ వద్ద గల టీకా యొక్క రకం మరియు అందుబాటులో ఉన్న టీకా యొక్క స్టాకును అనుసరించి ఇచ్చిన సమాచారం మేరకు  మాత్రమే పౌరులకు అపాయింట్‌మెంట్ స్లాట్లు మరియు షెడ్యూలు అందించడానికి వీలు కల్పించాలి.
 
ప్రతి ప్రైవేట్ CVC  లో అన్ని ఆన్‌లైన్ టీకా స్లాట్లు  కోవిన్ లేదా ఆరోగ్య సేతు నుండి మాత్రమే నమోదు చేయబడి అందించబడతాయి.
 
వీటిని జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు మరియు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారులు తదనుగుణంగా చర్యలు  తీసుకుని నిర్వహించవలసి ఉంటుంది.