మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 18 డిశెంబరు 2020 (14:54 IST)

ఆంధ్రాలో కాంట్రాక్టుల పందేరం : కేశినేని నాని

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టుల పందేరం జరిగింది. మొత్తం 791 కోట్ల విలువైన రోడ్డు కాంట్రాక్టులకు సంబంధించిన వివరాలను టీడీపీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు. 
 
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సొంత మనుషులకు వందలాది కోట్ల విలువైన కాంట్రాక్టులను పంచిపెట్టారని ఆరోపించారు. మొత్తం రూ.791 కోట్ల విలువైన రోడ్డు కాంట్రాక్టులను తన వాళ్లకు పంచారన్నారు. సోషల్ మీడియా ద్వారా ఎవరెవరికి ఎంత విలువైన కాంట్రాక్టులను ఇచ్చారో వివరాలను వెల్లడించారు.
 
'ఆ కాంట్రాక్ట్స్ దక్కించుకున్న కంపెనీల వివరాలను కూడా ఆయన వివరించారు. పీఎల్ఆర్ (పెద్దిరెడ్డి): 126.10 కోట్లు... ఎన్ఎస్ఆర్పీ (నర్రెడ్డి .. పులివెందుల, వైఎస్ చుట్టం): 228.59 కోట్లు. కేసీవీఆర్ (సురేష్ రెడ్డి): 128.36 కోట్లు. 
 
నితిన్ సాయి కన్ స్ట్రక్షన్స్ (పార్థసారథి వైకాపా): 121.63 కోట్లు. జేఎంసీ కన్ స్ట్రక్షన్స్ (శ్రీనివాసులు చిత్తూర్ వైకాపా ఎమ్మెల్యే): 186.85 కోట్లు' అని సోషల్ మీడియా ద్వారా కేశినేని నాని తెలిపారు. మరోవైపు, కడప, కర్నూలు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో ఈ రోడ్డు పనులను చేపట్టనున్నారు.