సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి

పంచాయతీరాజ్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ.. మొత్తం 510 పోస్టులు

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. హైదరాబాద్ నగరంలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన (ఎన్ఐఆర్డీపీఆర్) ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది.  మొత్తం 510 పోస్టుల్ని భర్తీ చేసేందుకుగానూ నోటిఫికేషన్ విడుదల చేసింది. 
 
దేశ వ్యాప్తంగా క్లస్టర్ మోడల్ గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయడంలో భాగంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ హైదరాబాద్లోని ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ప్రస్తుతానికి ఏడాది కాలపరిమితితో ఉద్యోగాలు చేస్తున్నారు. పనితీరు, అవసరాన్ని బట్టి గడువు పొడిగించే అవకాశం ఉంది. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో చూసుకోవాల్సి ఉంటుంది.
 
మొత్తం పోస్టులు - 510
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
క్లస్టర్ లెవెల్ రీసోర్స్ పర్సన్- 250
యంగ్ ఫెలోస్- 250
స్టేట్ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్- 10
దరఖాస్తు చివరి తేదీ: డిసెంబర్ 29