శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 డిశెంబరు 2020 (21:39 IST)

ఓ తండ్రి రాసలీలల దృశ్యాలను బయటపెట్టిన ఆన్‌లైన్ క్లాసులు!!

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత మార్చి నుంచి విద్యా సంస్థలన్నీ మూతపడ్డాయి. దీంతో విద్యా సంవత్సరం వృధా కాకుండా ఉండేందుకు ఆన్‌లైన్ క్లాసులను నిర్వహిస్తున్నాయి. దీంతో ప్రతి ఒక్క విద్యార్థి తమతమ ఇళ్ళలోనే ఉంటూ స్మార్ట్ ఫోన్ల సాయంతో ఆన్‌లైన్ తరగతులకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో ఓ తండ్రి రాసలీలల దృశ్యాలను ఆన్‌లైన్ క్లాసులు బయటపెట్టాయి. తండ్రి పరాయి స్త్రీతో జరిపిన రాసలీలల బాగోతం కుమార్తె కంటపడింది. అంతే.. ఆ చిన్నారి నేరుగా వెళ్లి తల్లికి చూపించడంతో వారి కాపురంలో చిచ్చురేగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లా నాగమంగల తాలూకాకు చెందిన కుమార్ అనే వ్యక్తి ఆన్‌లైన్ క్లాసుల కోసం కుమార్తెకు తన స్మార్ట్‌ఫోన్‌ను ఇచ్చాడు. కాసేపు.. క్లాసుల్లో నిమగ్నమైన కుమార్తె.. క్లాసులు ముగిశాక తండ్రి స్మార్ట్‌ఫోన్‌లో కొన్ని ఫోల్డర్స్‌ను తెరిచి చూసింది. 
 
అందులోని వీడియాలోను ప్లే చేయగా, తన తండ్రి మరో మహిళతో రాసలీలలు జరుపుతున్న దృశ్యాలు కనిపించాయి. వెంటనే.. ఆ వీడియోలను తల్లికి చూపింది. షాక్‌కు గురైన తల్లి తాను అన్యాయానికి గురయ్యానని, న్యాయం చేయాలంటూ మహిళా సాంత్వన కేంద్రాన్ని ఆశ్రయించింది. నాగమంగల పోలీస్ స్టేషన్‌లో కూడా భర్తపై ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.