శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 18 నవంబరు 2020 (14:04 IST)

తుంగభద్ర పుష్కరాలకు ముహూర్తం ఖరారు.. సీఎం చేతుల మీదుగా...

తుంగభద్ర పుష్కరాలకు డేట్‌ ఫిక్స్‌ అయింది. ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం 1:21 గంటలకు పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. పుష్కర ప్రారంభ ముహుర్తం కోసం జరిగిన దైవజ్ఞ సమ్మేళనంలో పంచాంగకర్తలు ఏకాభిప్రాయానికి వచ్చి, విషయాన్ని దేవాదాయ శాఖకు తెలియజేశారు. గతంలో 2008 లో తుంగభద్ర పుష్కరాలు సాగగా... ఈ ఏడాది 20 నుంచి డిసెంబర్‌ 1 వరకూ అంటే 12 రోజులు ఈ పుష్కరాలు జరగనున్నాయి. 
 
తుంగభద్ర పుష్కరాలను ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. 20వ తేదీన కర్నూలు జిల్లాలోని సంకల్‌ బాగ్‌ పుష్కర ఘాట్‌ వద్ద శాస్త్రోకంగా జరిగే కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ఇక పుష్కరాల కోసం కర్నూలు జిల్లాలో 23 ఘాట్లను అధికారులు ఏర్పాటు చేశారు. 
 
అన్ని చోట్లా నదీ స్నానాలకు బదులుగా జల్లు స్నానాలు చేయాలని భక్తులకు సూచించింది ప్రభుత్వం. పితృ దేవతలకు పిండ ప్రదానాదులకు నిర్వహించేందుకు 443 మంది పురోహితులను నియమించినట్లు దేవాదాయ శాఖ పేర్కొంది.