ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 నవంబరు 2020 (12:40 IST)

కన్నతల్లితో కామవాంఛలు... అలా చేయనందుకు అమ్మను చంపేసిన కామాంధుడు

ఓ కామాంధుడు నవమాసాలు పెంచి పోషించిన కన్నతల్లితోనే పడకసుఖం పంచుకోవాలని భావించాడు. ఇందుకు ఆమె తొలుత నిరాకరించి, తర్వాత సహకరించింది. అదేసమయంలో ఆమె మరికొందరితో సంబంధాలు పెట్టుకుంది. దీన్ని జీర్ణించుకోలేని కుమారుడు అమ్మను చంపేశాడు. ఈ దారుణం కర్నాటక రాష్ట్రంలోని హవేరీ జిల్లా వనహళ్లి గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన 21 యేళ్ళ శివప్ప అనే యువకుడి తండ్రి ఓ యేడాది క్రితం ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతను తన తల్లితో కలిసి జీవిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఆమె అదే గ్రామానికి చెందిన పలువురుతో వివాహేతర సంబంధాలు పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న కన్నకొడుకు కూడా ఆమెతో పడక సుఖం పంచుకోవాలని భావించాడు. 
 
ఆ ప్రకారంగా ఓ రోజున కన్నతల్లిపై లైంగిక దాడికి తెగబడ్డాడు. ఆ సమయంలో ఆమె అడ్డు చెప్పాల్సిందిపోయి.. కుమారుడికి సహకరించింది. అప్పటి నుంచి వారిమధ్య శారీరక సంబంధం కొనసాగుతూ వచ్చింది. ఈ క్రమంలో ఆ మహిళ మరింతగా రెచ్చిపోసాగింది. మరికొందరు పురుషులతో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇది శివ‌ప్ప స‌హించ‌లేక‌పోయాడు. ఇక‌పై ఎవ‌రినీ క‌ల‌వ‌డానికి వీల్లేద‌ని, త‌న‌తో మాత్ర‌మే ఉండిపోవాల‌ని త‌ల్లిని హెచ్చ‌రించాడు. 
 
అయిన‌ప్ప‌టికీ ఆమె అత‌డి మాట‌ను లెక్క చేయ‌లేదు. దీంతో ఆవేశంతో ఊగిపోయిన శివ‌ప్ప‌ త‌ల్లిని దారుణంగా హ‌త్య చేశాడు. ఈ ఘ‌ట‌న‌పై అత్యాచారం, హ‌త్య కింద కేసు న‌మోదు చేసిన‌ పోలీసులు నిందితుడిని శ‌నివారం అరెస్టు చేశారు. నిందితుడు నేరం అంగీక‌రించిన‌ట్లు ఒప్పుకున్నార‌ని పోలీసులు తెలిపారు.