బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వి
Last Modified: శనివారం, 7 నవంబరు 2020 (13:56 IST)

కర్ణాటక రాజ్యసభలో అడుగు పెట్టనున్న సినీ నటి ఖుష్బూ?

కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి ఇటీవలే బీజేపీలో చేరిన తమిళ నటి ఖుష్బూ త్వరలో కర్ణాటక రాజ్య సభలో అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ సభ్యత్వానికి బీజేపీ అధిష్ఠానం ఆమె పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకకు చెందిన రాజ్యసభ సభ్యుడు అశోక్ గస్తీ ఇటీవల కరోనాతో కన్నుమూసారు. ఈ స్థానానికి డిసెంబరు ఒకటో తేదీన ఎన్నిక జరగనుండగా ఆ సీటు కోసం ఖుష్బూ పేరును బీజేపీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
 
ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నకవ్వడం ఇక్కడ సర్వసాధారణమే. వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రం నుంచి ఒకరిని ఎన్నిక చేస్తే ఆ ఎన్నికల్లో లబ్ది పొందవచ్చని బీజేపీ యోచనగా కనిపిస్తోంది. ఇందులో భాగంగా ముగ్గురు పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
 
వీరిలో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, కర్ణాటకలో సేవలు అందించిన ఐపీఎస్ అధికారి అన్నామలై, సినీ నటి ఖుష్బూ పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే బీజేపీ పరిశీలనను రజినీకాంత్ అంగీకరించే అవకాశం లేదని తెలిస్తోంది. మిగిలిన ఆ ఇధ్దరిలో ఖష్బూను ఎంపిక చేస్తే రాష్ట్రంలో బీజేపీ ఇమేజ్ పెరుగుతుందని ఆ రాష్ట్ర బీజేపీ నాయకులు భావిస్తున్నారు. మరో నాలగైదు రోజుల్లో ఖుష్బూ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.