సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వి
Last Modified: శుక్రవారం, 30 అక్టోబరు 2020 (14:36 IST)

సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్యంపై ఖుష్బూ ట్వీట్

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్య పరిస్థితులపై పలు రకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో దీనిపై నిన్న రజినీకాంత్ స్పందించిన విషయం తెలిసిందే. తన పేరిట ప్రచారమవుతున్న లేఖ తనది కానప్పటికీ అందులో ఉన్న సమాచారం మాత్రం వాస్తవమే అని ఆయన క్లారిటీ ఇచ్చారు.
 
ఈ నేపథ్యంలో రజినీకాంత్ గురించి బీజేపీ నాయకురాలు ఖుష్బూ ఓ ట్వీట్ చేశారు. ప్రియమైన రజినీకాంత్ సార్, మాకు మీ ఆరోగ్యం, సంతోషం కంటే మరొకటి లేదని తెలిపారు. మీరు మా మేలిమిని కోరుకునే వారు. మీరు మా నిధి, మీరు ఆరోగ్యపరంగా ఇతర విషయాల పరంగా ఏది చేస్తే మీకు మంచిది జరుగుతుందో అదే చేయండి.
 
మీపై మాకు ఉన్న ప్రేమను ఏ విషయమూ తగ్గించలేదు. మా జీవితాంతం మిమ్మల్ని ఆరాధిస్తూనే ఉంటాము అని ఖుష్బూ అందులో ట్వీట్ చేశారు.