శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 25 అక్టోబరు 2020 (09:10 IST)

వాష్‌రూంకు వెళ్లొచ్చేసరికి టాప్ ఆర్డర్ కుప్పకూలింది.. సీఎస్కేను 'తలైవా' కూడా రక్షించలేడు...

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ ఇప్పటివరకు 12 సీజన్లు జరిగాయి. ప్రస్తుతం యూఏఈ గడ్డపై 13వ సీజన్ జరుగుతోంది. ఈ సీజన్‌లో అత్యంత చెత్త ప్రదర్శనతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వరుస ఓటములను చవిచూస్తోంది. ముఖ్యంగా, గతంలో రెండు సార్లు ఛాంపియన్‌గా నిలిచి, ఓసారి రన్నరప్‌గా నిలిచిన ఐపీఎల్.. ఈ సీజన్‌లో మాత్రం ఘోర పరాజయాలను చవిచూస్తోంది.

ముఖ్యంగా, చెన్నై జట్టు గెలవుకపోయినా ఫర్లేదుకానీ, వికెట్లు పడకుంటే చాలురా బాబూ అంటూ సీఎస్కే ఫ్యాన్స్ కోరుకునే స్థాయికి ఆ జట్టు ప్రదర్శన దిగజారిపోయింది. ఫలితంగా ఘోర పరాభవాలను మూటకట్టుకుంటోంది. ఈ సీజన్‌లో అత్యంత దారుణంగా ఆడిన జట్టు ఇదే. వరుస ఓటములతో ఇప్పటికే ప్లేఆఫ్‌కు వెళ్లే అవకాశాన్ని కోల్పోయింది. దీంతో, జట్టుపై అభిమానులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్ ద్వారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముంబైతో జరిగిన మ్యాచ్ లో చెన్నై జట్టు పూర్తిగా తేలిపోయిందన్నారు. వాష్ రూమ్‌కి వెళ్లొచ్చేసరికి చెన్నై టాప్ ఆర్డర్ పెవిలియన్‌కు చేరిందన్నారు. 
 
వాష్ రూమ్ నుంచి వచ్చిన తర్వాత స్కోరు చూసి షాకయ్యానని అన్నాడు. గతంలో తమ జట్టు ఆటగాళ్లు బంతిని బాదుతుంటే చెన్నై అభిమానులు కేరింతలు కొట్టే వారని... కానీ నిన్న మాత్రం 'వికెట్ పడకుంటే చాలురా భగవంతుడా' అని కోరుకున్నారని చెప్పాడు. ఈ సారి సీఎస్కేని తలైవా (రజనీకాంత్) కూడా కాపాడలేరని అన్నాడు.