సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 అక్టోబరు 2020 (16:27 IST)

కీర్తి సురేష్ ''మిస్ ఇండియా'' ట్రైలర్.. పెంగ్విన్ తర్వాత మరో హిట్ ఖాయం? (video)

Keerthy Suresh
"మహానటి'' ఫేమ్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో మిస్ ఇండియా మూవీ తెరకెక్కుతోంది. నూతన దర్శకుడు నరేంద్ర నాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మిస్ ఇండియా మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని.. రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ చిత్రాన్ని దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్‌లో రిలీజ్ చేయనున్నారు. త్వరలో రిలీజ్ కానున్న ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసారు.
 
ఇక ట్రైలర్ విషయానికి వస్తే... చిన్నప్పటి నుంచి ఉన్నతమైన కలలు కలిగిన అమ్మాయిగా కనిపించింది. తాను అనుకున్నది సాధించే క్రమంలో ఒడిదుడుకులను ఛాలెంజ్‌లను ఎలా ఎదుర్కొంది. సాధారణ అమ్మాయి అసాధారణ అమ్మాయిగా ఎలా ఎదిగింది..? ఈ క్రమంలో కుటుంబం, బిజినెస్‌లో ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొంది అనేదే ఈ సినిమా కథ అనిపిస్తుంది.
 
ఇందులో సీనియర్ నటుడు జగపతి బాబు, కీర్తి సురేష్‌ మధ్య సంభాషణలు, ఈ మూవీకి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతం ఆకట్టుకుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే... మిస్ ఇండియా ఆడియన్స్‌లో ఆసక్తిని కలిగించిందనే చెప్పాలి. దీంతో పెంగ్విన్ తర్వాత కీర్తి సురేష్‌కి మరో హిట్ ఖాయమనే చెప్తున్నారు. ఇకపోతే.. కీర్తి సురేష్ మిస్ ఇండియా నవంబర్ 4న విడుదల కానుంది.