సర్కారు వారి పాటలో మహేష్‌కి జోడీగా మహానటి.. (Video)

Keerthy
Keerthy
సెల్వి| Last Updated: శనివారం, 17 అక్టోబరు 2020 (20:04 IST)
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా సినిమాతో మాస్ లుక్‌లో రాబోతున్నాడు. పరుశురామ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా భారత బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల నేపథ్యంలో ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. బ్యాంక్ మేనేజర్ లుక్‌లో అతడు కనిపించనున్నాడు. ఈ సినిమా తొలి షెడ్యూలును అమెరికాలోని డెట్రాయిట్ నగరంలో ప్రారంభించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్‌పై ఈ సినిమా తీస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఇక ఈ సినిమాకు ఇప్పటి వరకు హీరో ఎవరు అనే సందిగ్ధత ఉండేది. కానీ తాజాగా వాటికి చెక్ పెడుతూ చిత్ర యూనిట్ ఓ పోస్ట్ చేసింది. మహానటిగా గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ ఈ సినిమాలో నటించబోతోందని అధికారికంగా ప్రకటించింది. ఆమె పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ.. తమ టీంలోకి ఆహ్వానిస్తూ పోస్టర్ విడుదల చేసింది.

సరిలేరు నీకెవ్వరు సూపర్ హిట్ తర్వాత మహేష్ నటించబోయే ఈ సినిమాలో ఇటీవల వరకు కూడా కీర్తి సురేష్ హీరోయిన్ అనే ప్రచారం ఇండస్ట్రీలో జరిగింది. అదే నిజమై హీరోయిన్‌గా ప్రకటించారు. దీంతో ఆమెకు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.





దీనిపై మరింత చదవండి :