శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 13 జులై 2018 (09:04 IST)

నేడు కాంగ్రెస్‌ పార్టీలోకి కిరణ్‌... ముహూర్తం ఉదయం 11.30

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆఖరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి మళ్లీ సొంతగూటికి చేరుకోనున్నారు. శుక్రవారం ఢిల్లీలో ఉదయం 11.30 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సమక్షంలో పా

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆఖరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి మళ్లీ సొంతగూటికి చేరుకోనున్నారు. శుక్రవారం ఢిల్లీలో ఉదయం 11.30 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్‌ చాందీ, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
 
రాష్ట్రాన్ని విభజించాలన్న కాంగ్రెస్‌ అధిష్టాన నిర్ణయంతో విభేదించిన కిరణ్‌.. 2014 ఫిబ్రవరి 19న సీఎం పదవికి రాజీనామా చేశారు. అదే యేడాది మార్చి 12న జై సమైక్యాంధ్ర పేరుతో కొత్త పార్టీని ప్రారంభించారు. ఈ పార్టీ తరపున 2014 ఎన్నికల్లో అభ్యర్థులను బరిలోకి దించారు. కానీ, ఆయన మాత్రం పోటీ చేయలేదు. ఈ పార్టీ తరపున ఒక్కరంటే ఒక్క అభ్యర్థి కూడా విజయం సాధించలేదు. 
 
దీంతో ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అంటే గత నాలుగున్నరేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఏడాది కింద రాహుల్‌ గాంధీతో ఆయనతో ఏకాంతంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలోపేతం కావాలంటే.. రాజకీయంగా అనుసరించాల్సిన వ్యూహాలపై కిరణ్‌ తన అభిప్రాయాలను వెల్లడించారు. అపుడే కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని భావించారు. కానీ ఆయన దూరంగానే ఉన్నారు. 
 
ఈ నేపథ్యంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యహారాల ఇన్‌చార్జి ఉమెన్‌ చాందీతో హైదరాబాద్‌లో ఆయన భేటీ అయ్యారు. అపుడు పార్టీలోకి రావాలని ఉమెన్ చాందీ ఆహ్వానించారు. రాహుల్‌తో సమావేశమయ్యేందుకు ఏర్పాట్లూ చేసి, కిరణ్ పార్టీలో చేరే ముహూర్తాన్ని కూడా ఆయనే ఖరారు చేశారు.