భార్యతో మనస్పర్ధలు.. ఇంజనీరింగ్ విద్యార్థినితో చనువు-పెళ్లి ఫిక్స్.. ఫోటోలు వీడియోలు బయటపెడ్తానని?
మహిళలపై వేధింపులు పెచ్చరిల్లిపోతున్నాయి. కామాంధులు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతుంటే.. మరికొందరు వేధింపులతో మహిళలను హింసిస్తున్నారు. తాజాగా తనను పెళ్లి చేసుకోకుంటే తనతో కలిసి తిరిగిన వీడియోలు బయటపెడతా
మహిళలపై వేధింపులు పెచ్చరిల్లిపోతున్నాయి. కామాంధులు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతుంటే.. మరికొందరు వేధింపులతో మహిళలను హింసిస్తున్నారు. తాజాగా తనను పెళ్లి చేసుకోకుంటే తనతో కలిసి తిరిగిన వీడియోలు బయటపెడతానంటూ విద్యార్థినిని వేధిస్తున్న వ్యక్తిని సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. రామ్ నగర్‌కు చెందిన కంపా సందీప్ (25)కు గతంలోనే పెళ్లయింది.
భార్యతో మనస్పర్థలు రావడంతో ఏడాది కాలంగా ఓ ఇంజనీరింగ్ విద్యార్థినితో చనువుగా ఉంటున్నాడు. ఆమెకు తల్లిదండ్రులు మరో వ్యక్తితో వివాహం నిశ్చయించారు. దీంతో కక్ష పెంచుకున్న సందీప్ వారిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫొటోలను ఫేస్‌బుక్‌లో పెట్టాడు.
అంతేగాకుండా వారిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలను.. యూట్యూబ్‌లో పెడుతానంటూ బెదిరించాడు. అయితే బాధితురాలు సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో సందీప్ గతంలో ఆరుగురు యువతులను ప్రేమించి మోసం చేసినట్లు విచారణలో వెల్లడైంది.