సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 1 డిశెంబరు 2017 (12:22 IST)

రేవంత్‌ను చూసి దూరం జరుగుతున్న మీడియా..?

తెలంగాణ టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డికి తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే రేవంత్ రెడ్డి ఇష్యూలో ముఖ్యంగా ఆంధ్ర మీడియా చేస్తున్న ఓవరాక్షన్‌పై కేసీఆర్ ఫ

తెలంగాణ టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డికి తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే రేవంత్ రెడ్డి ఇష్యూలో ముఖ్యంగా ఆంధ్ర మీడియా చేస్తున్న ఓవరాక్షన్‌పై కేసీఆర్ ఫైర్ అయినట్లు తెలుస్తోంది. రేవంత్ ప్రెస్ మీట్ పెట్టినా.. ఎక్కడికెళ్లినా మైకులు పెట్టేస్తున్న ఆంధ్రా మీడియాపై కేసీఆర్ గుర్రుగా వున్నారట. నోటిదూల వున్న మనిషికి మైక్ ఇస్తారేంటి అంటూ సన్నిహితుల వద్ద మండిపడ్డారట. ఈ విషయాన్ని ఆంధ్రా మీడియా అధికారుల చెవులో వేశారట. 
 
రేవంత్ రెడ్డిని మ‌రీ ఎక్కువ‌గా చూపించ‌డం ద్వారా సీఎం కేసీఆర్ సీరియస్ అవుతున్నారనే విషయాన్ని తెలియజేశారట. కొద్దిగానైనా రేవంత్ రెడ్డికి మీడియా ఛాన్స్ ఇవ్వడాన్ని తగ్గించాలని కేసీఆర్ అన్నట్లు సమాచారం. దీంతో రేవంత్ రెడ్డి రాజీనామా అంశంతోపాటు ఇత‌ర కామెంట్స్ ఏవీ కూడా టీవీ స్క్రోలింగ్స్ కూడా క‌నిపించ‌టం లేదని తెలిసింది. దీంతో రేవంత్ రెడ్డిని చూస్తేనే మీడియా సంస్థలన్నీ కాస్త దూరం జరుగుతున్నాయట..!