బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : మంగళవారం, 28 నవంబరు 2017 (13:11 IST)

మెట్రో రైలు ప్రాజెక్టును కూలగొడుతామన్న కేసీఆర్ (వీడియో)

హైదరాబాద్ మెట్రో రైల్‌ ప్రాజెక్టును పూర్తి చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన వెంటనే కూలగొడుతామని ఉద్యమ నేతగా ఉన్న సమయంలో తెరాస అధినేత కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్ మెట్రో రైల్‌ ప్రాజెక్టును పూర్తి చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన వెంటనే కూలగొడుతామని ఉద్యమ నేతగా ఉన్న సమయంలో తెరాస అధినేత కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ మెట్రోపై అనేక అభ్యంతరాలు ఉన్నాయన్నారు. ఈ ప్రాజెక్టులో తీవ్రమైన అవకతవకలు ఉన్నాయన్నారు. అసలు ఇది హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టా లేదా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టా అనేది పూర్తి స్థాయిలో రివ్యూ చేసి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. 
 
అలాగే, హైదరాబాద్‌‌లోని వారసత్వ సంపద, ప్రధాన మార్కెట్లు, అసెంబ్లీ భవనం తదితర అంశాలపై కేసీఆర్ నాడు చేసిన ప్రసంగానికి సంబంధిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. నాడు కాంగ్రెస్ ప్రభుత్వం పునాది వేసిన మెట్రో ప్రాజెక్టును ఇదే కేసీఆర్ సీఎం అయ్యాక విజయవంతంగా పూర్తి చేసి మంగళవారం ప్రజల అందుబాటులోకి తెస్తున్నారు. ఈనేపథ్యంలో స్పిరిట్ ఆఫ్ తెలంగాణ ట్యాగ్‌లైన్‌పై ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోను మీరూ ఓసారి చూడండి.