సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 22 ఆగస్టు 2023 (08:22 IST)

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి వైద్య పరీక్షలు.. ఎందుకో తెలుసా?

jagan
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం వైద్య పరీక్షలు చేయించుకున్నారు. విజయవాడలోని ఒక ప్రైవేటు డయాగ్నోస్టిక్‌ ల్యాబ్‌లో ఈ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆయన గత కొన్ని రోజులుగా కాలి మడమ నొప్పితో బాధ పడుతున్నారు. 
 
సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మొగల్రాజపురంలోని ఓ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌కు వచ్చారు. ఎంఆర్‌ఐ స్కాన్‌తో పాటు వివిధ రక్త పరీక్షలు చేయించుకున్నట్లు తెలుస్తోంది. రెండు గంటల పాటు ల్యాబ్‌లోనే ఉన్నారు. తిరిగి మూడు గంటల సమయంలో తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయానికి వెళ్లారు. సీఎం సతీమణి భారతి రెడ్డి వెంట ఉన్నారు.