సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 21 ఆగస్టు 2023 (10:47 IST)

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలోని ఏడు జిల్లాలకు వర్షసూచన

rain
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావం కారణంగా ఏపీలో ఏడు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఏడు జిల్లాల్లో ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. ఉత్తర కోస్తాలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. అందువల్ల మత్స్యుకారులు సముద్రంలోకి వెళ్లవద్దని కోరింది. 
 
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గుంటూరు, కృష్ణ, బాపట్ల, ఏలూరు, అల్లూరు, శ్రీకాకుళం, పార్వతీపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర కోస్తాలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది. తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అందువల్ల జాలర్లు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని కోరింది. 
 
మరోవైపు తెలంగాణాలో కూడా అల్పపీడన ప్రభావం కారణంగా మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, కామారెడ్డి, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, సిరిసిల్ల, సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.