సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Updated : సోమవారం, 29 మార్చి 2021 (10:19 IST)

హోలీ శుభాకాంక్షాలు తెలిపిన గవర్నర్

"హోలీ పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా  శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హోలీ పండుగ అనేది రంగురంగుల శక్తివంతమైన పండుగ. ఇది ప్రజలలో సోదరభావం, సౌహార్దాలను బలోపేతం చేస్తుంది. సమాజంలో శాంతి, శ్రేయస్సును సూచిస్తుంది.
 
హోలీ పర్వదినం సందర్భంగా రంగులు చిలకరించడం ఆనందాలను పంచుకోవటం ద్వారా జాతీయ సమైక్యతపై మన నమ్మకాన్ని, విశ్వాసాన్ని బలపరుస్తుంది. హోలీ పండుగ అన్ని సామాజిక అడ్డంకులను అధికమించి సత్యం యొక్క శక్తిని, చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుంది.
 
కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ ఎల్లప్పుడూ ముసుగు ధరించి, సామాజిక దూరాన్ని కాపాడుకోవడం ద్వారా ఇంట్లో పండుగను జరుపుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అర్హత ఉన్న వారందరూ ముందుకు వచ్చి టీకాలు వేయించుకోవాలి. ఈ సంతోషకరమైన శుభదినాన నేను మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా శుభాకాంక్షలు  తెలియజేస్తున్నాను." అని అన్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.