శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 5 జులై 2021 (06:43 IST)

శ్రీశైలం ఆలయంలో అర్థరాత్రి డ్రోన్ల చక్కర్లు..

శ్రీశైలం ఆలయంలో నిన్న అర్థరాత్రి డ్రోన్లు చక్కర్లు కొట్టడం కలకలాన్ని రేపింది. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ పరిసరాల్లో ఆకాశంలో అనుమానాస్పదంగా డ్రోన్‌ కెమెరాలు చక్కర్లు కొట్టినట్టు ఆలయ అధికారులు చెప్పారు.

డ్రోన్ల కదలికలను గుర్తించిన పోలీసులు, ఆలయ సిబ్బంది వాటిని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేసినా అవి చిక్కలేదు. గత నాలుగు రోజులుగా రాత్రిపూట ఆలయ పరిసరాల్లో ఆకాశంలో డ్రోన్లు ఎగురుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు.

శ్రీశైలంలో అనుమానాస్పదంగా డ్రోన్లు సంచరించడంతో స్థానికులు, భక్తులు ఆందోళన చెందుతున్నారు. కొంతకాలంగా భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దులో డ్రోన్లు కలకలాన్ని సఅష్టిస్తుండగా.. కొన్నింటిని సైన్యం పేల్చివేసింది.

తాజాగా, జమ్మూ ఎయిర్‌పోర్ట్‌పై డ్రోన్లతో దాడికి పాల్పడటం, ఆ తర్వాత పాకిస్థాన్‌లోని భారత ఎంబసి పరిసరాల్లో డ్రోన్లు ఆకాశంలోకి ఎగరడంపై సర్వత్రా ఆందోళన కలుగుతోంది.