బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 9 నవంబరు 2017 (11:20 IST)

జగన్ ముద్దులకు భయపడి మహిళలు పారిపోతున్నారు

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి జవహర్ సెటైర్లు విసిరారు. ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న జగన్ ఎక్కడ ముద్దులు పెడతారోనని మహిళలు భయపడి పారిపోతున్నారని సెటైర్ వేశారు. అధికారం కోసమే జగన్ పాదయాత్ర

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి జవహర్ సెటైర్లు విసిరారు. ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న జగన్ ఎక్కడ ముద్దులు పెడతారోనని మహిళలు భయపడి పారిపోతున్నారని సెటైర్ వేశారు. అధికారం కోసమే జగన్ పాదయాత్ర చేస్తున్నారని, ఆ యాత్ర ముగిసే సరికి వైసీపీ ఖాళీ కావడం ఖాయమని అభిప్రాయపడ్డారు. ప్యారడైజ్ పేపర్లలో తన పేరు లేదని జగన్ బుకాయిస్తున్నారని, తన అక్రమాస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎందుకు జప్తు చేసిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
 
ఇదిలా ఉంటే.. వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించిన మూడు రోజులకే ఆయన నడుం నొప్పితో బాధపడుతున్నట్టు సమాచారం. తొలిరోజు పది కిలోమీటర్లు నడిచిన జగన్ నడుం నొప్పికి గురవడంతో అత్యవసరంగా ఫిజియోథెరపిస్ట్‌ని పిలిపించి వైద్య సేవలందించినట్టు పార్టీ వర్గాల సమాచారం. వైద్యుల సూచనల మేరకు నడుంపై ఒత్తిడి పడకుండా ఉండేందుకు మెడికేటెడ్ బెల్ట్‌ను నడుంకు ధరించాలని సూచించారట. దీంతో, నడుం బెల్టు పెట్టుకుని తన పాదయాత్రను జగన్ కొనసాగిస్తున్నారు.