శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 డిశెంబరు 2023 (15:50 IST)

మంత్రి ఆర్కే రోజాకు క్రికెట్ పాఠాలు నేర్పిన సీఎం జగన్

Roja_Jagan
Roja_Jagan
ఏపీలో జరుగుతున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా క్రీడల మంత్రి ఆర్కే రోజాతో కలిసి పాల్గొన్న సీఎం వైఎస్ జగన్.. ఈ సందర్భంగా ఆమెతో క్రికెట్ బ్యాట్ పట్టించారు. తన కేబినెట్ మంత్రి ఆర్కే రోజాకు క్రికెట్ పాఠాలు నేర్పించారు.  బ్యాటింగ్ ఎలా చేయాలో స్వయంగా ఆడి చూపించారు. దీంతో ఆమె కూడా అన్న చెప్పిన విధంగా బ్యాటింగ్ చేస్తూ హల్ చల్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. సీఎం వైఎస్ జగన్ తొలుత క్రికెట్ పిచ్‌పై బ్యాటింగ్ చేయమంటూ బ్యాట్ చేతికి ఇచ్చి మంత్రి ఆర్కే రోజాను ఆహ్వానించారు. 
 
అనంతరం బ్యాట్ పట్టుకున్న రోజాకు పిచ్ పై దాన్ని ఎక్కడ పెట్టాలో తెలియకపోవడంతో స్వయంగా సీఎం జగన్ క్రీజులో బ్యాట్ ఎక్కడ ఉంచాలో, క్రీజులో ఎలా నిలబడాలో, బ్యాటింగ్ ఎలా చేయాలో చేసి చూపించారు. ఓసారి క్రీజులో బ్యాటింగ్ చేయడం మొదలుపెట్టాక తొలి బంతినే ఆర్కే రోజా క్లీన్ షాట్ కొట్టేశారు. దీంతో మంత్రులు చప్పట్లు కొట్టారు. ఆపై జగన్ కూడా కాసేపు క్రికెట్ ఆడారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోకు నెట్టింట వైరల్ అవుతోంది.