ఆ బాలిక వయసు 4 యేళ్లు.. అతని వయసు 65 యేళ్లు... పాడు పనికి పాల్పడ్డాడు...
కామంతో కళ్లు మూసుకుపోయి సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరించాడు ఓ కామాంధుడు. మనవరాలి వయసున్న చిన్నారిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. చిన్నారి గట్టిగా కేకలు వేయడంతో వదిలేశాడు.
అనంతపురం జిల్లా హిందూపురం అర్బన్, పరిగి మండలంలోని ఓ గ్రామంలో జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, గ్రామానికి చెందిన ఓ చిన్నారి(4)పై అదే గ్రామానికి చెందిన 65 సంవత్సరాల వయసున్న వృద్ధుడు నారాయణరెడ్డి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆడుకుంటున్న చిన్నారిని చాక్లెట్ ఇస్తానని ఇంట్లోకి పిలిచాడు. అనంతరం చిన్నారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు.
చిన్నారి గట్టిగా కేకలు వేయడంతో వదిలేశాడు. వెంటనే బాధిత చిన్నారి పరిగెత్తుకుంటూ వెళ్లి తల్లికి చెప్పింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో అఘాయిత్యానికి పాల్పడిన మాట వాస్తవమేనని చెప్పారు.