శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 31 అక్టోబరు 2018 (20:12 IST)

ద్యావుడా.. తిరుమలలో ఇద్దరు మహిళలు అర్చకుడిని రేప్ చేయబోయారు..?

సాధారణంగా పురుషులు స్త్రీలను అత్యాచారం చేసింది వినుంటాం. కానీ తిరుమలలో అంతా రివర్స్. ఇద్దరు మహిళలు ఒక అర్చకుడిని రేప్ చేయబోయారు. అంతేకాదు రివర్స్‌లో అర్చకుడే తమపై అత్యాచారం చేయడానికి బలవంతపెట్టాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిజాన్ని తెలుసుకుని పోలీసులు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.
 
శ్రీవారి ఆలయంలో సంభావన అర్చకులుగా పనిచేస్తున్న మణికంఠాచార్యులు, మారుతి ప్రసాదాచార్యుల మధ్య గత కొన్నినెలలుగా విభేదాలు ఉన్నాయి. ఒకరంటే ఒకరికి పడదు. మణికంఠాచార్యులని ఉద్యోగం నుంచి ఎలాగైనా తీయించాలనుకున్నాడు మారుతి. కడపకు చెందిన కళ్యాణి, సరోజాలపై రెండు లక్షల బేరం కుదిరించుకుని మణికంఠాచార్యులను బలవంతం చేయండి అంటూ సలహా ఇచ్చాడు. విధులు ముగించుకుని తన గదికి వెళ్ళిన మణికంఠాచార్యులపైన ఇద్దరు మహిళలు బలవంతం పెట్టారు. 
 
మణికంఠ గట్టిగా కేకలు వేయగా స్థానిక అర్చకులు వచ్చి మహిళలను పట్టుకున్నారు. అయితే మహిళలు మాత్రం మణికంఠే తమతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళలను పోలీస్టేషన్‌లో ఉంచి విచారించగా అసలు విషయం బయటపడింది.