#MetooSafe అంటూ డాక్యుమెంటరీ.. ఇందులో ఏముంది? (Video)
దేశ వ్యాప్తంగా మీ టూ ఉద్యమం కుదిపేస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో #MetooSafe పేరుతో ఓ డాక్యుమెంటరీ నెట్టింట వైరల్ అవుతోంది. పురుషుల కారణంగా లైంగిక దాడికి, లైంగిక వేధింపులకు గురైన వారిపై పలు రంగాలకు చెందిన మహిళలు తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకుంటున్న నేపథ్యంలో.. మీటూ సేఫ్ అనే కొత్త ఉద్యమం మొదలైంది.
ఈ ఉద్యమం ద్వారా పురుషుల్లో కొందరే అలాంటి వారని.. చాలామంది మహిళలకు భద్రత కల్పించేవారున్నారని చెప్పేలా ఈ డాక్యుమెంటరీ వుంది. ఉత్తరాదిన తనూ శ్రీ, దక్షిణాదిన గాయని చిన్మయి మీ టూ ఉద్యమానికి పునాది రాళ్లేశారు. ఆపై ఎందరో మహిళలు తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి బహిర్గతం చేశారు.
ఇలాంటి నేపథ్యంలో.. ప్రముఖ కొరియోగ్రాఫర్ షెరిఫ్ తన ట్విట్టర్ పేజీలో కొన్ని మీ టూ సంఘటనలను పోస్టు చేశారు. పలు రంగాల్లో తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను ఆ డాక్యుమెంటరీలో చెప్పించారు. అయితే కొందరు పురుషుల చేతిలో నలిగినా.. మరికొందరి చేత రక్షించబడినట్లు ఆ డాక్యుమెంటరీలో తెలిపారు. ప్రస్తుతం షెరిఫ్ పోస్టు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.