శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 27 అక్టోబరు 2018 (16:02 IST)

అర్జున్ అలాంటి వాడు కాదు.. మద్దతిచ్చిన ఖుష్బూ.. వెనక్కి తగ్గిన ప్రకాష్ రాజ్

యాక్షన్ కింగ్ అర్జున్‌, శ్రుతి హరిహరన్‌ల వివాదం ఇప్పుడు కన్నడనాట పెను దూమారాన్ని రేపుతోంది. ఈ వివాదంపై కన్నడ ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు అంబరీష్‌ ఆధ్వర్యంలో అర్జున్‌, శ్రుతి హరిహరన్‌ మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు.


అంతకుముందు అర్జున్‌ మేనల్లుడు ధృవ బెంగుళూరు సివిల్‌ కోర్ట్‌లో శ్రుతిపై రూ.5 కోట్ల పరువు నష్టం దావా వేశారు. శ్రుతి తనకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని అర్జున్‌ డిమాండ్‌ చేశారు. కానీ శ్రుతి మాత్రం తన వ్యాఖ్యలకు కట్టుబడి వున్నానని.. రాజీకొచ్చే ప్రసక్తే లేదని.. క్షమాపణలు చెప్పేది లేదని తేల్చి చెప్పేసింది. 
 
ఈ నేపథ్యంలో అర్జున్‌కు సినీయర్‌ నటీమణుల మద్దతు లభిస్తోంది. సీనియర్ నటి ఖుష్బూ స్పందిస్తూ, శృతి ఆరోపించినట్టు అర్జున్‌ అలాంటి వ్యక్తి కాదు. ప్రతి ఒక్కరికి ఎంతో గౌరవ మర్యాదలిస్తారు. ఆయన అలా చేయలేదని నేను గ్యారంటీ ఇస్తా. తన 34ఏళ్ల సినీ జీవితంలో ఆయనెప్పుడూ అసభ్యంగా ప్రవర్తించలేదని చెప్పింది. 
 
అలాగే ఇతర నటీమణులు తారా అనురాధా, హర్షిక పూణచ్చా సైతం అర్జున్‌కి మద్దతుగా నిలిచారు. అర్జున్‌ ఆరోపణలపై ప్రకాష్‌ రాజ్‌ భిన్నంగా స్పందించారు. మొదట శ్రుతికి మద్దతుగా మాట్లాడిన ఆయన ప్రస్తుతం అర్జున్‌ నిందితుడంటూ తాను ఆరోపించలేదని వెనక్కి తగ్గారు.

దీనిపై కన్నడ సాంస్కృతిక శాఖా మంత్రి ఇ.జయమాలా స్పందిస్తూ, మీటూ మహిళలకు ఓ బలమైన వేదిక. అయితే ఆధారం లేని విషయాలను పత్రికల ముందు నిలబడి చెప్పడం సరికాదు. అర్జున్‌ మంచి నటుడంటూ మద్దతిచ్చారు.