ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: శనివారం, 21 ఏప్రియల్ 2018 (17:40 IST)

నా బ్యాగులోనే కాదు నా కారులో కూడా బైబిల్ ఉంటుంది... అయితే ఏంటి? చిక్కుల్లో ఎమ్మెల్యే అనిత

పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత చిక్కుల్లో పడ్డారు. హిందూ ధార్మిక సంఘాల ఆగ్రహాన్ని చవిచూస్తున్నారు. ఇప్పటివరకు కొంతమంది రాజకీయ నాయకులతో ఇబ్బందిపడ్డ అనిత ఇప్పుడు హింధూ ధార్మిక సంఘాల నేతల ఆగ్రహాన్ని ప్రత్యక్షంగా చవిచూస్తున్నారు. ఏకంగా టిటిడి పాలకమండలి సభ్యు

పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత చిక్కుల్లో పడ్డారు. హిందూ ధార్మిక సంఘాల ఆగ్రహాన్ని చవిచూస్తున్నారు. ఇప్పటివరకు కొంతమంది రాజకీయ నాయకులతో ఇబ్బందిపడ్డ అనిత ఇప్పుడు హింధూ ధార్మిక సంఘాల నేతల ఆగ్రహాన్ని ప్రత్యక్షంగా చవిచూస్తున్నారు. ఏకంగా టిటిడి పాలకమండలి సభ్యురాలిగా ఆమెను ప్రభుత్వం నియమించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అది కూడా ఒక క్రిస్టియన్ మతస్తురాలిని హిందూ ధార్మిక సంస్థలకు సలహాలు ఇవ్వడానికి.
 
నా బ్యాగులో బైబిల్ ఉంటుంది.. నా గదిలో బైబిల్ ఉంటుంది.. నా కారులో కూడా బైబిల్ వుంటుంది. బైబిల్ లేకుండా నేను కాళ్ళు బయటపెట్టను. ఇదంతా ఎవరో కాదు చెప్పింది సాక్షాత్తు టిటిడి పాలకమండలి సభ్యురాలిగా ఎన్నికైన ఎమ్మెల్యే అనిత. ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు. గతంలో క్రిస్టియన్ ఛారిటీస్‌కు ఈమె ప్రత్యక్షంగా సహకరించడంతో పాటు క్రిస్టియన్ మతానికి చెందిన వ్యక్తి కావడంతో హిందూ ధార్మిక సంఘాలన్నీ మండిపడుతున్నాయి.
 
ఒక క్రిస్టియన్‌ను ఎలా టిటిడి పాలకమండలిలో నియమిస్తారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. చంద్రబాబు తన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకుని హిందువులను మాత్రమే పాలకమండలి సభ్యులుగా నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలో పడ్డట్లు సమాచారం. మరి అనిత ఎంపికను వెనక్కి తీసుకుంటారో లేదో చూడాలి.