1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: సోమవారం, 13 నవంబరు 2017 (20:12 IST)

వాణీ విశ్వనాథ్‌ను చూసి రోజా బెదుర్సా? పుట్టినరోజు నాడు నిరుద్యోగులకు బంపర్ ఆఫర్...

ఫైర్ బ్రాండ్ రోజా తన పుట్టినరోజున నిరుద్యోగులకు ఒక బంపర్ ఆఫర్ ఇవ్వాలని నిర్ణయానికి వచ్చేశారు. బాగా చదువుకుని నిరుద్యోగులుగా తిరుగుతున్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని నిర్ణయానికి వచ్చారు రోజా. అందుకే తన పుట్టినరోజు

ఫైర్ బ్రాండ్ రోజా తన పుట్టినరోజున నిరుద్యోగులకు ఒక బంపర్ ఆఫర్ ఇవ్వాలని నిర్ణయానికి వచ్చేశారు. బాగా చదువుకుని నిరుద్యోగులుగా తిరుగుతున్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని నిర్ణయానికి వచ్చారు రోజా. అందుకే తన పుట్టినరోజు 17వ తేదీ జరుపుకోనుండటంతో ఆ రోజు తన సొంత నియోజకవర్గంలో ఒక జాబ్ మేళాను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు ఈ జాబ్ మేళా ఉంటుంది. 
 
తనకు తెలిసిన 40 కంపెనీల్లో రోజా ఉద్యోగాలు ఇప్పించనున్నారు. పుత్తూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఇప్పటికే నియోజకవర్గ పరిధిలో పెద్దఎత్తున కరపత్రాలను కూడా పంపిణీ చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే వచ్చే ఎన్నికల్లో తన గెలుపు సుళువవుతుందనేది రోజా ఆలోచన. అందుకే ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. మొత్తమ్మీద వాణీ విశ్వనాథ్‌ను చూసి జడుసుకున్నట్లే వున్నది కదూ.