సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: శనివారం, 4 నవంబరు 2017 (21:28 IST)

తిరుమలలో జగన్ కంటే రోజా స్పెషల్ అట్రాక్షన్ అయ్యారా?

సినీ తారలు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేస్తుండటంతో రాజకీయాల్లో ఉన్న నేతలు వారిలా రెడీ అవ్వడం సాధ్యం కాదు. రాజకీయ నేతలు ఒకేలా ఉండిపోతుంటారు. ఒక్కోసారి పార్టీలో ఉన్న కీలక నేతలను క్రిందిస్థాయిలో ఉన్న నేతలే డామినేట్ చేసేలా ఉంటారు. అలాంటి పరిస్థితే జగన్ మోహ

సినీ తారలు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేస్తుండటంతో రాజకీయాల్లో ఉన్న నేతలు వారిలా రెడీ అవ్వడం సాధ్యం కాదు. రాజకీయ నేతలు ఒకేలా ఉండిపోతుంటారు. ఒక్కోసారి పార్టీలో ఉన్న కీలక నేతలను క్రిందిస్థాయిలో ఉన్న నేతలే డామినేట్ చేసేలా ఉంటారు. అలాంటి పరిస్థితే జగన్ మోహన్ రెడ్డికి తిరుమలలో ఎదురైంది.
 
పాదయాత్ర దిగ్విజయం కావాలని శ్రీవారిని ప్రార్థించేందుకు తిరుమలకు వచ్చిన జగన్.. తన వెంట వైసిపి నేతలందరినీ వెంట పెట్టుకుని వెళ్ళారు. ఆలయంలోకి ఎంటర్ అయినప్పటి నుంచి జగన్ కంటే రోజాను పలుకరించే వారే ఎక్కువై పోయారు. ఆలయంలోని టిటిడి సిబ్బంది, జగన్ వెంట వచ్చిన కొంతమంది నేతలు రోజాకు కరచాలనం చేసేందుకు ఎగబడ్డారు. కట్టు, బొట్టుతో పట్టుచీర కట్టుకుని రోజా సాంప్రదాయబద్ధంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రోజాతో కరచాలనం చేసేందుకే ఎక్కువమంది పోటీలు పడ్డారు.