శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By TJ
Last Modified: శుక్రవారం, 20 అక్టోబరు 2017 (18:22 IST)

తిరుమల శ్రీవారి దర్శనానికి ఇలా వెళ్ళి అలా వచ్చెయ్యవచ్చు...

తిరుమల శ్రీవారి దర్సనం కోసం గంటల తరబడి క్యూలైన్లు, కంపార్టుమెంట్లలో వేచి ఉండాలి. ఎన్ని గంటలకు దర్శనం అవుతుందో తెలియక ఇబ్బంది పడుతుంటాం. గంటగంటకూ రద్దీ పెరిగితే ఇక అంతే. ఒక రోజంతా కంపార్టుమెంట్లోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటిది ఇప్పుడు తిర

తిరుమల శ్రీవారి దర్సనం కోసం గంటల తరబడి క్యూలైన్లు, కంపార్టుమెంట్లలో వేచి ఉండాలి. ఎన్ని గంటలకు దర్శనం అవుతుందో తెలియక ఇబ్బంది పడుతుంటాం. గంటగంటకూ రద్దీ పెరిగితే ఇక అంతే. ఒక రోజంతా కంపార్టుమెంట్లోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటిది ఇప్పుడు తిరుమలలో రద్దీనే లేదు. కారణం దీపావళి పండుగ కాబట్టి. అందరూ తమతమ ఇళ్ళలో పండుగ చేసుకుంటుండటంతో పుణ్యక్షేత్రాలను సందర్శించే వారి సంఖ్య తగ్గిపోయింది.
 
తిరుమలలో అనూహ్యంగా రద్దీ తగ్గిపోయింది. కంపార్టుమెంట్లలోకి వెళితే నేరుగా స్వామివారి దగ్గర వరకు లైన్ ఆగకుండా వెళ్ళిపోతుంది. కేవలం 40 నిమిషాల్లోనే స్వామి దర్శన భాగ్యం లభిస్తోంది. కంపార్టుమెంట్లన్నీ ఖాళీగానే ఉన్నాయి. పండుగ ఎఫెక్టుతో ప్రస్తుతం ఈ పరిస్థితి ఏర్పడి ఉండవచ్చునని టిటిడి అధికారులు భావిస్తున్నారు.
 
త్వరితగతిన దర్శనం దొరుకుతుండటంతో వెళ్ళిన భక్తులే.. మళ్ళీమళ్ళీ వెళ్ళి స్వామిని దర్శించుకుంటున్నారు. అయితే రేపు శనివారం కాబట్టి ఈ రోజు సాయంత్రం తరువాత మళ్ళీ రద్దీ పెరిగే అవకాశం ఉందని టిటిడి భావిస్తోంది.