గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By TJ
Last Modified: సోమవారం, 9 అక్టోబరు 2017 (19:19 IST)

తిరుమల శ్రీవారి కళ్ళ నుంచి శక్తివంతమైన కిరణాలు వస్తాయా?

తిరుమల వెంకన్న మూలవిరాట్టును సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపంగా కూడా భావిస్తుంటారు. స్వామివారిపై ఉన్న తిరునామం ఆయన కళ్ళను మూసి ఉంచుతుంది. శ్రీవారిని దర్శించుకునే భక్తులు సగభాగం మాత్రమే చూడగలుగుతారు. మిగిలిన సగ భాగం తిరునామం కింద ఉంటుంది.

స్వామివారి విగ్రహం పాదాల నుంచి పొంగిపొరలే జలప్రవాహాన్ని విరజా నదిగా పిలుస్తుంటారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఇది ఎక్కడ నుంచి ప్రవహిస్తుందనేది ఇంతవరకు ఎవరికీ అంతుచిక్కలేదు. అంతేకాదు అప్పుడప్పుడు స్వామివారి విగ్రహం వేడి పొగలను కక్కుతూ ప్రసరిస్తూ ఉంటుంది. 
 
శ్రీవారి కళ్ళ నుంచి అత్యంత శక్తివంతమైన కిరణాలు వస్తున్నాయని భావించిన అర్చకులు ఎక్కువ రోజులు కళ్ళను మూసి ఉంచే విధంగా తిరునామాన్ని పెద్దదిగా పెడతారని చెప్పుకుంటారు. వారంలో ఒక్కరోజు మాత్రమే.. అంటే గురువారం మాత్రమే స్వామివారి కళ్ళను పూర్తిగా దర్శించే విధంగా తిరునామాన్ని చిన్నదిగా పెడతారు.