మంగళవారం, 7 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వెబ్‌దునియా స్పెషల్ 08
  3. బ్రహ్మోత్సవాలు
Written By ivr
Last Updated : శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (21:54 IST)

స్వర్ణ రథంపై ఊరేగిన తిరుమల శ్రీవారు(వీడియో)

కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి స్వర్ణ రథంపై ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. దివ్యసుంద

కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి స్వర్ణ రథంపై ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. దివ్యసుందరంగా అలంకృతమైన శ్రీవారు స్వర్ణ రథంపై ఆశీనులై తిరుమాడ వీధుల్లో ఊరేగిన వైనాన్ని తిలకించిన భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. గురువారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఈ స్వర్ణ రథోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. గరుడోత్సవం తర్వాత భారీ సంఖ్యలో భక్తులు పాల్గొనే ఈ ఉత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం భారీ ఏర్పాట్లను చేపట్టింది. 
 
మరోవైపు నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమల కొండ భక్తజనవాహినితో నిండిపోయింది. వీడియో చూడండి...