బుధవారం, 8 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వెబ్‌దునియా స్పెషల్ 08
  3. బ్రహ్మోత్సవాలు
Written By TJ
Last Modified: ఆదివారం, 24 సెప్టెంబరు 2017 (18:31 IST)

చిన్నశేషునిపై చిద్విలాసం చేసిన శ్రీనివాసుడు (video)

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల వెంకన్న సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో రెండవరోజు ఉదయం స్వామి వారు చిన్నశేషునిపై ఊరేగారు. చిన్నశేష వాహనంపై చిద్విలాసం చేస్తూ ఊరేగుతున్న స్వామివారిని లక్షలాది మంది భక్తులు దర

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల వెంకన్న సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో రెండవరోజు ఉదయం స్వామి వారు చిన్నశేషునిపై ఊరేగారు. చిన్నశేష వాహనంపై చిద్విలాసం చేస్తూ ఊరేగుతున్న స్వామివారిని లక్షలాది మంది భక్తులు దర్శించుకున్నారు.
 
కోలాటాలు, చెక్కభజనలు, ఏనుగుల ఘీంకార ధ్వనులు, వేదపండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య వైభవోపేతంగా చిన్నశేషవాహనం జరిగింది. గోవిందా.. గోవిందా అంటూ భక్తులు నామ స్మరణలు చేశారు.