గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వెబ్‌దునియా స్పెషల్ 08
  3. బ్రహ్మోత్సవాలు
Written By TJ
Last Modified: శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (13:21 IST)

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులందరికీ దర్శనం, ప్రసాదం...

అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం. ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజుల పాటు జరుగనున్నాయి. ప్రతిరోజు రెండు వాహనాల్లో స్వామివారు ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. బ్రహ్మోత్సవాలంటేనే ఒక పండుగ. ఉత్సవాల సమయంలో స

అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం. ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజుల పాటు జరుగనున్నాయి. ప్రతిరోజు రెండు వాహనాల్లో స్వామివారు ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. బ్రహ్మోత్సవాలంటేనే ఒక పండుగ. ఉత్సవాల సమయంలో సెలవులు రావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు వస్తుంటారు. ప్రతి యేటా బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు దర్శనం, ప్రసాదాలు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అయితే వాటిని అధిగమించేందుకు టిటిడి ఉన్నతాధికారులు ఈసారి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
 
బ్రహ్మోత్సవాలకు బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేయడమే కాకుండా తొమ్మిది రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు దర్శనం, ప్రసాదాలు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజుల పాటు పూర్తిగా సిఫారసు లేఖలను రద్దు చేసి ప్రతి ఒక్కరికీ దర్శనభాగ్యం కల్పించనున్నారు. 
 
ఇప్పటికే బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయి. ఈ నెల 23 నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు తొమ్మిదిరోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. 27వ తేదీన జరిగే గరుడ సేవకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 23వ తేదీన ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. ప్రతి భక్తుడికి లడ్డు ప్రసాదాన్ని అందించి తీరుతామంటున్నారు టిటిడి ఉన్నతాధికారులు.