ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 11 ఆగస్టు 2017 (11:57 IST)

శ్రీలంకతో వన్డే సిరీస్.. విరాట్ కోహ్లీకి రెస్ట్.. రోహిత్ శర్మకు పగ్గాలు..

శ్రీలంకతో జరుగనున్న ఐదు వన్డేల సిరీస్‌కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 20న తొలి వన్డే ప్రారంభం కానుంది. 12వ తేదీన శ్రీలంకతో చివరి టెస్టు మొదలుకానుంది. ఐప

శ్రీలంకతో జరుగనున్న ఐదు వన్డేల సిరీస్‌కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 20న తొలి వన్డే ప్రారంభం కానుంది. 12వ తేదీన శ్రీలంకతో చివరి టెస్టు మొదలుకానుంది. ఐపీఎల్, ఛాంపియన్స్ ట్రోఫీ, వెస్టిండీస్ పర్యటన, శ్రీలంక పర్యటనల కారణంగా ఆటగాళ్లు పూర్తిగా అలసిపోయారు. 
 
ఈ నేపథ్యంలో గత కొంత కాలంగా విశ్రాంతి లేకుండా వరుస సిరీస్‌లు ఆడుతున్న కోహ్లీతో పాటు   మరికొంత మంది ఆటగాళ్లకు విశ్రాంతిని కల్పించాలని బీసీసీఐ భావిస్తోంది. ఇందులో భాగంగా కోహ్లీతో పాటు జడేజా, ఉమేష్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, షమిలు వన్డే సిరీస్‌కు దూరం కానున్నారు. 
 
ఇక విరాట్ కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మ కెప్టెన్సీ పగ్గాలను చేపట్టే ఛాన్సుందని బీసీసీఐ వర్గాల సమాచారం. అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్ దీప్ యాదవ్, బసిల్ థంపిలు జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.