శుక్రవారం, 1 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 31 జులై 2025 (16:15 IST)

Samantha: సమంత, రాజ్ కలిసి డిన్నర్ చేశారా? కారులో జతగా కనిపించారుగా! (video)

Samantha-Raj Nidimoru
Samantha-Raj Nidimoru
గత కొన్ని నెలలుగా ప్రేమలో ఉన్నట్లు పుకార్లు ఎదుర్కొంటున్న నటి సమంత రూత్ ప్రభు, చిత్రనిర్మాత రాజ్ నిడిమోరు బుధవారం ముంబైలో ఒకే కారులో కలిసి కనిపించారు. ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీస్తుండగా, ప్రైవేట్ క్షణంలా అనిపించే వీడియోలను రికార్డ్ చేస్తుండగా రాజ్ సీరియస్‌గా కనిపించారు. 
 
సమంత, రాజ్ కలిసి డిన్నర్ చేసినట్లుగా అనేక వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడ్డాయి. వారు కలిసి భోజనం చేసినట్లు తెలుస్తోంది. సమంత, రాజ్ కలిసి కారులో ఒక రెస్టారెంట్ నుండి బయటకు వస్తుండగా.. కెమెరాకు చిక్కారు. 
 
ఈ వీడియోలు, ఫోటోలు అభిమానులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇటీవల శుభం చిత్రాన్ని నిర్మించింది. ఇది బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను ఇచ్చింది. అలాగే 'ఓ బేబీ' బాక్సాఫీస్ హిట్ అయిన నేపథ్యంలో, సమంత నందిని రెడ్డితో కలిసి రెండో సినిమా చేసే అవకాశం వుందని తెలుస్తోంది.