శుక్రవారం, 1 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : గురువారం, 31 జులై 2025 (16:07 IST)

వార్ 2 లో హృతిక్ రోషన్, కియారా అద్వానీ లిప్ కిస్ ల రొమాంటిక్ సాంగ్

Hrithik Roshan, Kiara Advani Lip Kiss Song
Hrithik Roshan, Kiara Advani Lip Kiss Song
యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన 'వార్ 2' నుంచి మొదటి ట్రాక్‌ విడుదల అయింది. సూపర్ స్టార్స్ అయిన హృతిక్ రోషన్, కియారా అద్వానీలపై తీసిన ఈ రొమాంటిక్ పాట ' నీ గుండె గుమ్మంలోకి ప్రతిరోజూ' ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. "బ్రహ్మాస్త్ర"లోని బ్లాక్‌బస్టర్ పాట 'కేసరియా' పాటని కంపోజ్ చేసిన టీం ఈ రొమాంటిక్ సాంగ్ రూపొందించారు. హిందీలో ఈ పాటకు ప్రీతమ్ బాణీ, అమితాబ్ భట్టాచార్య లిరిక్స్, అరిజిత్ సింగ్ గాత్రాన్ని అందించారు.
 
ఇక తెలుగులో ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. తెలుగులో ఈ పాటను శాశ్వత్ సింగ్, నిఖితా గాంధీ ఆలపించారు. హృతిక్, కియారా మధ్య బ్యూటీఫుల్ కెమిస్ట్రీ, పాటను తెరకెక్కించిన విధానం, లోకేషన్స్ అన్నీ కూడా అధ్భుతంగా ఉన్నాయి. కియారా పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఈ పాట అందరినీ ఆకట్టుకునేలా ఉంది. సాంగ్ లో పలుసార్లు కియారా లిప్ కిస్ ఇచ్చే సీన్స్ బాగున్నాయి. స్విమ్ సూట్ లో యూత్ ను అలరిస్తుంది. 
ఆదిత్య చోప్రా నిర్మించిన "వార్ 2" ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషలలో విడుదల కానుంది.