మోహినీ వాహనంపై సర్వేశ్వరుడు
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన బుధవారం ఉదయం కలియుగదైవం శ్రీవేంకటేశ్వర స్వామివారు మోహినీ అవతారంలో నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన బుధవారం ఉదయం కలియుగదైవం శ్రీవేంకటేశ్వర స్వామివారు మోహినీ అవతారంలో నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని వజ్ర వైఢూర్యాలతో పొదిగిన కనకాభరణాలు, గజమాలలతో అలంకరించి వాహనంపై అధిష్టింపజేశారు. అంతకుకు ముందు స్నపన తిరుమంజనం నిర్వహించారు. మోహినీ అవతారంపై ఉన్న స్వామివారిని లక్షలాదిమంది భక్తులు దర్శించుకున్నారు.
నాలుగోరోజు రాత్రి స్వామివారు సర్వభూపాల వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సర్వభూపాల వేషధారిగా ఉభయ నాంచారుల సమేతంగా స్వామివారు విహరించారు. శరణుగోరి వచ్చిన భక్తజనానికి అభయ ప్రదానం చేశారు. ఇటీవల రూపొందించిన ఏడడుగుల సంపూర్ణ స్వర్ణమయ సర్వభూపాల వాహనం రాత్రివేళ దేదీప్యమానంగా వెలుగులీనింది.