శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 18 జూన్ 2017 (12:45 IST)

ప్యాంటు వేసుకోవడం మర్చిపోయావా ఛార్మీ? గురుద్వారలో ఈ గౌనేంటి? నెటిజన్లే కాదు.. పూరీ కూడా?

మొన్నటికి మొన్న ప్రియాంకా చోప్రా ప్రధాని నరేంద్ర మోడీ వద్దకు వెళ్ళిన సందర్భంగా మోకాళ్ళు దాటని డ్రస్సు వేసుకుని వివాదంలో నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఛార్మి డ్రెస్ వివాదంలో చిక్కుకుంది. ఛార్మి ఓ

మొన్నటికి మొన్న ప్రియాంకా చోప్రా ప్రధాని నరేంద్ర మోడీ వద్దకు వెళ్ళిన సందర్భంగా మోకాళ్ళు దాటని డ్రస్సు వేసుకుని వివాదంలో నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఛార్మి డ్రెస్ వివాదంలో చిక్కుకుంది. ఛార్మి ఓ గురుద్వార్‌కి వెళ్ళింది. అక్కడికి ఏదో సంప్రదాయబద్ధంగా కాకుండా, తన ఇష్టం వచ్చినట్టు మోకాళ్ళ దాకా ఉండే గౌను వేసుకెళ్లింది. ఆ ఫోటోను కాస్త సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో రచ్చ మొదలైంది. 
 
''ప్రియాంకాకి ఎటూ బుద్ధి లేదు.. నీ బుద్ధి ఏమైందంటూ" అంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఫ్యాషన్ సెన్స్ చూపించుకోవడానికి గురుద్వార దొరికిందా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ ఎపిసోడ్ మీద పూరి తెగ చిరాకు పడుతున్నాడట. టాప్  ఫ్యాంటు వేసుకోవడానికి మరిచిపోయావా అంటూ ప్రశ్నిస్తున్నారు. పవిత్రమైన గురుద్వార్‌కు వెళ్లేటప్పుడు ఇలాంటి డ్రెస్ వేసుకెళ్తారా అంటూ అడుగుతున్నారు. 
 
ప్రస్తుతం ఛార్మి పోర్చుగల్‌లో బాలయ్య, పూరీ జగన్నాథ్ సినిమాలో బిజీ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో పోర్చుగల్‌లో గురుద్వారాకు వెళ్లింది. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలే ప్రస్తుతం ఛార్మిని వివాదంలోకి నెట్టాయి. చేతిలో ఆఫర్లు లేకుండా నానా తంటాలు పడుతున్న ఛార్మి, ప్రస్తుతం వివాదాలను కొనితెచ్చుకుంటుంది. ఈ వివాదాలను ఆమె పబ్లిసిటీ కోసమే కొనితెచ్చుకుంటుందా.. లేకుంటే ఏదో గురుద్వార్ వెళ్లి చూసొద్దామని చిక్కుల్లో పడిందా అనేది తెలియాల్సి వుంది. అయితే ఛార్మి డ్రెస్ వివాదమే ప్రస్తుతం టాక్ ఆఫ్ టౌన్‌గా మారిపోయింది.