శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By TJ
Last Modified: గురువారం, 20 జులై 2017 (22:18 IST)

తిరుమలలో క్రికెట్ దేవుడు... శ్రీవారి ఫోటోతో ఎగబడ్డ అభిమాని(వీడియో)

క్రికెట్ దేవుడుగా చెప్పుకునే సచిన్ టెండూల్కర్ తన అభిమానులకు ఎంత విలువ ఇస్తారో మరోసారి రుజువైంది. పటిష్టమైన భద్రత, ఓ వైపు తితిదే సెక్యూరిటీని దాటుకుంటూ ఓ అభిమాని సచిన్ టెండూల్కర్ వద్దకు చేరుకున్నాడు. క్రికెట్ దేవుడికి వెంకన్న ఫోటోను కానుకగా ఇవ్వాలని త

క్రికెట్ దేవుడుగా చెప్పుకునే సచిన్ టెండూల్కర్ తన అభిమానులకు ఎంత విలువ ఇస్తారో మరోసారి రుజువైంది. పటిష్టమైన భద్రత, ఓ వైపు తితిదే సెక్యూరిటీని దాటుకుంటూ ఓ అభిమాని సచిన్ టెండూల్కర్ వద్దకు చేరుకున్నాడు. క్రికెట్ దేవుడికి వెంకన్న ఫోటోను కానుకగా ఇవ్వాలని తపించాడు. 
 
ఇది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది అతడిని వెనక్కి వెళ్లాలని హెచ్చరించారు. ఐతే ఆ అభిమాని మాత్రం తన చేతిలోని వెంకన్న ఫోటోను సచిన్ టెండూల్కర్ కి ఇవ్వాలని అలాగే చూస్తు వున్నాడు. ఇది గమనించిన సచిన్ అతడిని దగ్గరికి రమ్మని అతడి ఇచ్చిన శ్రీవారి ఫోటోను తీసుకుని, అతడితో ఫోటో కూడా దిగడంతో సెక్యూరిటీ సిబ్బంది నివ్వెరపోయింది. దటీజ్ టెండూల్కర్.