Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

దువ్వాడ శ్రీనివాస్‌తో కొత్తింటిలోనే కలిసివుంటాను.. భార్య వాణి

Written By సెల్వి
Updated: ఆదివారం, 18 ఆగస్టు 2024 (01:29 IST)
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణితో కలిసి ఉండేందుకు శ్రీనివాస్ అంగీకరించడం లేదు. భార్యతో సెటిల్ చేసుకొని, విడాకులు తీసుకుంటానని స్పష్టం చేశారు. దాంతో ఫ్యామిలీ డ్రామా పదో రోజుకు చేరింది. దువ్వాడ శ్రీనివాస్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చిన తర్వాత వాణి కొత్త పల్లవి అందుకున్నారు. మరోసారి దువ్వాడ శ్రీను ఇంటి వద్దకు వచ్చారు. 
 
గేటు ముందు బైఠాయించి నిరసనకు దిగారు. తనకు ఆస్తి అవసరం లేదని మరో డ్రామాకు తెరతీశారు. దువ్వాడ శ్రీనుతో కలిసి ఉంటానని చెబుతున్నారు. శ్రీను కొత్తగా నిర్మించిన ఇంట్లోనే ఉంటానని తెగేసి చెప్పారు. తనకు ఏ ఆస్తి వద్దు, కూతుళ్ల భవిష్యత్‌ను శ్రీను చూసుకుంటే చాలని కొత్త పల్లవి అందుకున్నారు. కానీ వాణితో కలిసి ఉండేందుకు శ్రీనివాస్ ఇష్టపడటం లేదు.

తాజాగా వాణి మీడియాతో మాట్లాడుతూ.. తన సమస్యలను ఎవరితోనూ పంచుకోని శ్రీను.. తన సమస్యలను రకరకాలుగా డైవర్ట్ చేసుకుంటారని వాణి అన్నారు. ఆ సమస్యల నుంచి తప్పించుకోవడానికి మాపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే నేను ఓ నిర్ణయానికి వచ్చాను.

ఆడబిడ్డల భవిష్యత్తు కోసం.. ఆయన ఎలా తిరిగినా, ఎలా ప్రవర్తించినా నేను పట్టించుకోను. పిల్లల బాధ్యత అంతా ఆయనే తీసుకోవాలి. నాకు ఒక్క రూపాయి ఇవ్వకపోయినా ఫర్వాలేదు. ఈ మేరకు ఆయనతో లిఖితపూర్వకంగా రాజీ కుదుర్చుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నాను... అంటూ చెప్పారు.

అన్నీ చూడండి

Rajeev Kanakala: స్కూల్ లోనే పిల్లల భవిష్యత్ ఆధారపడుతుంది : రాజీవ్ కనకాల, వితికా షేరు

Gallery 5 NXTinAI: గ్యాలరీ5 NXTinAI: AI వెండితెరపైకి అడుగుపెడుతోంది

Catherine Tresa : కరికాల చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ థ్రెసా అలెగ్జాండర్

Vijay Deverakonda Interview: మన ప్రజల ధైన్యం అమెరికా స్వాతంత్య్ర పోరాటానికి స్ఫూర్తి : విజయ్ దేవరకొండ

Nani Bloody Romeo look :బ్లడీ రోమియో లో చెఫ్‌.. గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్న నాని

తర్వాతి కథనం
Show comments